LOADING...
IPL 2026 : మంగూస్‌ బ్యాట్‌తో రాహుల్ దుమ్మురేపుతాడు.. హెడెన్‌ కామెంట్స్ వైరల్
మంగూస్‌ బ్యాట్‌తో రాహుల్ దుమ్మురేపుతాడు.. హెడెన్‌ కామెంట్స్ వైరల్

IPL 2026 : మంగూస్‌ బ్యాట్‌తో రాహుల్ దుమ్మురేపుతాడు.. హెడెన్‌ కామెంట్స్ వైరల్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 24, 2026
03:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మాథ్యూ హెడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంగూస్‌ బ్యాట్‌ను ఉపయోగిస్తే గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు ఫినిషర్‌ రాహుల్‌ తెవాతియా అద్భుతంగా రాణించే సామర్థ్యం ఉన్న ఆటగాడని ఆయన పేర్కొన్నాడు. హెడెన్‌ మాట్లాడుతూ.. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో ఎవరికైనా తాను మంగూస్‌ బ్యాట్‌ను ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, దాన్ని రాహుల్‌ తెవాతియాకే ఇస్తానని అన్నారు. రాహుల్ తెవాతియాలో ఉన్న శక్తి, దూకుడు ఆ బ్యాట్‌కు బాగా సరిపోతాయని, ఆ బ్యాట్‌తో అతడు మంచి షాట్లు ఆడగలడని అభిప్రాయం వ్యక్తం చేశారు.

వివరాలు

ఆ సత్తా అతనికే ఉంది..!

టీ20 క్రికెట్‌లో ఐదు నుంచి పది పరుగుల తేడా కూడా మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మ్యాచ్‌ ప్రారంభం నుంచి చివరి దశ వరకు వేగంగా పరుగులు సాధించడం ఎంతో కీలకని హెడెన్ అన్నారు. గత నాలుగు సీజన్లలో రాహుల్‌ తెవాతియా ఎక్కువగా లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తూ వచ్చాడు. ఈ కాలంలో అతడు 43 ఇన్నింగ్స్‌ల్లో 150కుపైగా స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 591 పరుగులు నమోదు చేశాడు. ఇక హెడెన్‌ 2010లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడినప్పుడు మంగూస్‌ బ్యాట్‌తో విశేష ప్రదర్శన చేశాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 43 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఏడు సిక్స్‌ల సహాయంతో 93 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Advertisement