Kylian Mbappe: రూ.9వేల కోట్ల ఆఫర్‌ను వదులుకున్న ఫుట్ బాల్ ఆటగాడు ఎంబాపె
ఈ వార్తాకథనం ఏంటి
ఫుట్ బాల్ ఆటగాడు కైలియన్ ఎంబాపె, 9వేల కోట్ల ఆఫర్‌ను వదులున్నాడు. పారిస్ సెయింట్ జర్మన్ తరపున పదేళ్ళ పాటు ఆడేందుకు ఎంబాపెకు 1.1బియన్ యూరో(రూ.9వేల కోట్లు)లను చెల్లిస్తామని పారిసె సెయింట్ జర్మన్ క్లబ్ ఆఫర్ ఇచ్చింది.
కానీ, ఈ ఆఫర్‌ను ఎంబాపె తిరస్కరించాడు. అగ్రిమెంట్‌పై సంతకాలు చేయకుండా వదిలేసాడు. దీంతో పీఎస్‌జీ క్లబ్ ఎంబాపెను వదులుకోనుంది.
లీగ్ వన్ క్లబ్ లో ఎంబాపె ప్రస్తుతం ఆడుతున్నాడు. పీఎస్‌జీ క్లబ్ క్లబ్ తరపున ఎంబాపె ఆడే చివరి సీజన్ ఇదే అవుతుంది. ఆ తర్వాత ప్రీ జపాన్ టూర్ లో వేరే క్లబ్ తరపున ఎంబాపె ఆడతాడు.
Details
2018 ప్రపంచ కప్ గెలుపులో కీలకంగా ఎంబాపె
ఫుట్ బాల్ ఆటగాడిగా ఎంబాపెకు ఎంతో పేరుంది. 2022లో ఖతార్ లో జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్‌ని ఫైనల్‌కి తీసుకురావడంలో ఎంబాపె కీలకంగా వ్యవహరించాడు. ఫైనల్లో మూడు గోల్స్ చేసాడు ఎంబాపె.
మిగతా ఆటగాళ్ళు పెద్దగా ఆడకపోవడంతో 2022ఖతార్ ఫుట్ బాల్ ప్రపంచ కప్ చేజార్చుకున్నారు.
2018 ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేతగా ఫ్రాన్స్ నిలిచింది. ఆ సమయంలో కీలక ఆటగాడిగా ఎంబాపె ఉన్నారు. ఈ ప్రపంచకప్ సాధించడంలో ఎంబాపె కీలక పాత్ర పోషించాడు.