FIFA Worls cup: స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం.. మరోసారి సత్తా చాటిన ఎంబాపె
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ జట్టు ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి విజయవంతంగా ప్రవేశించింది. న్యూయార్క్-న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్వీడన్‌పై 3-0 గోల్స్ తేడాతో స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. ఫ్రాన్స్‌కు చెందిన స్టార్ ఫుట్‌బాలర్ కిలియన్ ఎంబాపె మరోసారి తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేసిన అతడు 45వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, 74వ నిమిషంలో రెండో గోల్‌తో జట్టు విజయాన్ని మరింత పటిష్ఠం చేశాడు. మరోవైపు 53వ నిమిషంలో బర్కోలా ఒక గోల్ చేసి ఫ్రాన్స్ ఖాతాలో మరో స్కోర్‌ను జోడించాడు.
వివరాలు
ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్...
ఈ మ్యాచ్‌తో ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో ఎంబాపె చేసిన గోల్స్ సంఖ్య 10కు చేరుకుంది. దీంతో టోర్నమెంట్ చరిత్రలో నాకౌట్ దశలో అత్యధిక గోల్స్ సాధించిన బ్రెజిల్ దిగ్గజాలు లియోనిడాస్, రొనాల్డో నజారియో చెరో 8 గోల్స్‌తో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సి పేరిట ఉన్న 19 గోల్స్ రికార్డుకు కేవలం ఒక గోల్ దూరంలో ఎంబాపె నిలిచాడు.