Page Loader
Rishabh Pant: రిష‌బ్‌ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో.. 
Rishabh Pant: రిష‌బ్‌ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో..

Rishabh Pant: రిష‌బ్‌ పంత్ ఇంట పెళ్లి బాజాలు.. 9 ఏళ్లుగా ప్రేమలో.. 

వ్రాసిన వారు Stalin
Jan 07, 2024
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

Rishabh Pant: టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ రిష‌బ్ పంత్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. పంత్ సోద‌రి సాక్షి పంత్ ఎంగేజ్‌మెంట్ శనివారం రాత్రి ఘనంగా జరిగింది. కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో దిగిన ఫోటోల‌ను రిష‌బ్ పంత్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు. దీంతో ఆ ఫొటోలు కాసేపట్లోనే వైరల్‌గా మారాయి. కాబోయే వ‌ధూ వ‌రుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పంత్ సోద‌రి సాక్షి.. అంకిత్ చౌద‌రీ గ‌త 9ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ ను చేసుకున్నారు. అతి త్వరలోనే సాక్షి, అంకిత్ పెళ్లి పీట‌లు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయండి

ఇన్‌స్టాలో పోస్టు చేసిన పంత్