ధోనీని కలవడంతో నా కల నిజమైంది: యశస్వీ జైస్వాల్
మైదానంలోనూ బయటా మిస్టర్ కూల్ అనిపించుకునే మహేంద్ర సింగ్ ధోనీని అభిమానించని వారెవరుంటారు? తన ఆట, మాట తీరుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకొనే ధోనీ ఎంతోమందికి ఆదర్శం. అభిమానులే కాదు చాలామంది యువ క్రికెటర్లు అతన్ని ఆరాధిస్తారు. టీమిండియాకు మూడు ప్రపంచ కప్ అందించిన ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని, చైన్నై ఫ్రాంచైజీకి ఐదు టైటిల్ అందించిన ధోనీ అభిమానుల జాబితా వెలకట్టలేనిది. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన యశస్వీ జైస్వాల్ కూడా ధోనీకి వీరాభిమాని. ధోనీని తొలిసారి కలసినప్పుడు తన కల నిజమైందని, ఆయను కలవడం తన జీవితంతో ఓ మధుర క్షణమని యశస్వీ జైస్వాల్ పేర్కొన్నారు.
ఆటతీరును మెరుగుపరిచే అంశాలపై దృష్టి సారిస్తా
ఇక తన ఆటతీరును మెరుగుపరిచే అంశాలపై దృష్టి సారిస్తానని, తాను ఆటను గౌరవిస్తానని, ఎవరైనా వావ్ యశస్వీ భలే షాట్ ఆడానని, అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడని అంటే వాటిని ఆశీస్సులుగా భావిస్తానని యశస్వీ జైస్వాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌లో యశస్వీ జైస్వాల్ అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచుల్లో 625 పరుగులు చేసి సత్తా చాటాడు. కోల్ కతా నైట్ రైడర్స్ పై 13 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకొని ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ లో అతని ప్రదర్శన కారణంగా వెస్టిండీస్ జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు యశస్వీ ఎంపికయ్యాడు.