2023 వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల.. దయాదుల సమరం ఎప్పుడంటే..?
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఈ వన్డే ప్రపంచకప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ టోర్నీ షూరూ కానుంది. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 15న టీమిండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. అదే విధంగా వార్నప్ మ్యాచులకు హైదరాబాద్, గౌహతి, తిరువనంతపురం అతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ వార్మప్ మ్యాచులు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా మూడు వరల్డ్‌కప్ మ్యాచులు జరగనున్నాయి.
టీమిండియా తలపడే జట్లు ఇవే
అక్టోబర్ 8 : భారత్ Vs ఆస్ట్రేలియా (చైన్నై) అక్టోబర్ 11 : భారత్ Vs ఆప్ఘనిస్తాన్ (ఢిల్లీ) అక్టోబర్ 15 : భారత్ Vs పాకిస్థాన్ (అహ్మదాబాద్) అక్టోబర్ 19 : భారత్ Vs బంగ్లాదేశ్ (పూణే) అక్టోబర్ 22 : భారత్ Vs న్యూజిలాండ్ (ధర్మశాల) అక్టోబర్ 29 : భారత్ Vs ఇంగ్లండ్ (లక్నో) నవంబర్ 2 : భారత్ Vs క్వాలిఫైయర్ 2 (ముంబై) నవంబర్ 5 : భారత్ Vs సౌతాఫ్రికా ( కోల్ కతా) నవంబర్ 11 : భారత్ Vs క్వాలిఫైయర్ 1 ( బెంగళూరు)