LOADING...
T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. 
టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే..

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో పాల్గొనే 20 జ‌ట్లు ఇవే.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్,శ్రీలంక ఆతిథ్య దేశాలుగా ఉంటూ 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఏవో ఖ‌రారు అయిపోయాయి. ఈ మెగాటోర్నీలో మొత్తం 20 జట్లు కప్పు కోసం పోటీపడతాయి. ఇటీవల చివరి బెర్త్‌ను యూఏఈ దక్కించుకుంది. ఈస్ట్ ఏషియా పసిఫిక్ క్వాలిఫయర్స్‌లో జపాన్‌పై గెలుపు సాధించడం ద్వారా యూఏఈ బెర్తును ఖాయం చేసుకుంది. అలాగే, ఈ రీజియనల్ క్వాలిఫయర్స్ ద్వారా ఒమన్, నేపాల్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్‌లను పొందడం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది.సొంత గ‌డ్డ‌పై జ‌ర‌గ‌నుండ‌డంతో మ‌రోసారి క‌ప్పును ముద్దాడాల‌ని భావిస్తోంది. మరో వైపు, ఇటలీ జట్టు తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది.

వివరాలు 

నేరుగా అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. 

ఆతిథ్య హోదాలో భారత్‌, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్‌-8 ద‌శ‌కు చేరిన ఏడు జ‌ట్లు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, యూఎస్‌ఏ లు సైతం నేరుగా అర్హత సాధించాయి. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్‌లు ప్ర‌పంచ‌క‌ప్ బెర్తుల‌ను సాధించాయి.

వివరాలు 

క్వాలిఫ‌య‌ర్స్ ద్వారా ఏఏ జ‌ట్లు అర్హ‌త సాధించాయంటే..? 

అమెరికా రీజియనల్‌ క్వాలిఫయర్‌ ద్వారా కెనడా, యూర‌ప్ క్వాలిఫ‌య‌ర్స్ ద్వారా నెద‌ర్లాండ్స్‌, ఇట‌లీలు ఆఫ్రికా క్వాలిఫయర్‌ ద్వారా నమీబియా, జింబాబ్వేలు ఈస్ట్‌ ఏషియా పసిఫిక్‌ క్వాలిఫయర్ ద్వారా ఒమన్‌, నేపాల్‌, యూఏఈ జట్లు ప్ర‌పంచ‌క‌ప్ బెర్తుల‌ను సాధించాయి. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. భార‌త్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ద‌క్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అమెరికా, వెస్టిండీస్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్‌, కెన‌డా, ఇట‌లీ, నెద‌ర్లాండ్స్‌, జింబాబ్వే, న‌మీబియా, నేపాల్, ఒమ‌న్‌, యూఏఈ

వివరాలు 

20 జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా.. 

గ్రూప్ స్టేజ్: మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపులుగా, ఒక్కో గ్రూప్‌లో 5 జట్లు విభజిస్తారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సూపర్-8కు చేరతాయి. సూపర్-8: 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడతాయి (గ్రూప్‌లలో 4 జట్లు). ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీఫైనల్స్కు వెళ్ళతాయి. సెమీఫైనల్స్ & ఫైనల్: సెమీఫైనల్స్‌లో విజేత జట్లు ఫైనల్లో కప్పు కోసం పోటీ పడతాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐసీసీ చేసిన ట్వీట్