MI vs CSK ముంబై ఇండియన్స్ పై సునాయాసంగా గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. చెన్నైలోని ఎమ్ఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో చెన్నై సునాయాసంగా గెలిచింది. ముంబై నిర్దేశించిన 140పరుగుల లక్ష్యాన్ని 6వికెట్ల తేడాతో 17.4ఓవర్లలో సాధించి తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ కు ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో నేహాల్ 64పరుగులు (51బంతుల్లో 8ఫోర్లు, 1సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ 26పరుగులు (22బంతుల్లో 3ఫోర్లు), త్రిష్టాన్ స్టబ్స్ 20 (21బంతుల్లో 2ఫోర్లు) చేసారు. మిగతా అందరూ కనీసం రెండంకెల స్కోరును కూడా చేయలేక 20ఓవర్లు ముగిసేసరికి 8వికెట్లు కోల్పోయి 139పరుగులు చేసారు.
దేవాన్ కాన్వే పరుగుల మెరుపులు
చెన్నై బౌలర్లలో మతీష పతిరానా 3వికెట్లు, దీపక్ చాహర్, తుషార్ దేశ్ పాండే తలా రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసుకున్నారు. 140పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్యాటర్లు, ఆది నుండి అద్భుత ప్రదర్శన కనబరిచారు. చెన్నై బ్యాటర్లు చేసిన పరుగులు: దేవన్ కాన్వే 44పరుగులు (42బంతుల్లో 4ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ 30పరుగులు (16బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు), శివమ్ దూబే 26పరుగులు (18బంతుల్లో 3సిక్సర్లు), అజింక్యా రహానే 21పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), అంబటి రాయుడు 12పరుగులు (11బంతుల్లో 1సిక్సర్) చేసారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా 2వికెట్లు, త్రిష్టాన్ స్టబ్స్, ఆకాష్ మద్వాల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.