LOADING...
Usman Khawaja: ఐదో టెస్ట్‌ తర్వాత ఉస్మాన్‌ ఖవాజా రిటైర్మెంట్‌? మైఖేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు 
మైఖేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు

Usman Khawaja: ఐదో టెస్ట్‌ తర్వాత ఉస్మాన్‌ ఖవాజా రిటైర్మెంట్‌? మైఖేల్‌ క్లార్క్‌ సంచలన వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాటర్‌ ఉస్మాన్‌ ఖవాజా భవిష్యత్‌పై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా త్వరలో జరగనున్న అయిదో టెస్ట్‌ మ్యాచ్‌ అనంతరం ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముందని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న ఖవాజా, ఈ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 8,000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఈ యాషెస్‌ సిరీస్‌లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు అతడు కేవలం ఒక్క హాఫ్‌ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు.

వివరాలు 

 చివరి టెస్ట్‌లో ఖవాజా రిటైర్‌ అవ్వాలి: మైఖేల్‌ క్లార్క్

ఈ సందర్భంగా మైఖేల్‌ క్లార్క్‌ మాట్లాడుతూ, "నాకు తెలిసి అయిదో టెస్ట్‌ ఖవాజా కెరీర్‌లో చివరి మ్యాచ్‌ కావచ్చు. సిడ్నీలో జరగనున్న టెస్ట్‌తో అతడు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. చివరి మ్యాచ్‌లో అయినా అతడు భారీ స్కోర్‌ చేయాలని కోరుకుంటున్నాను. మెల్‌బోర్న్‌లో కూడా అతడు సెంచరీ చేయలేకపోయాడు. చివరి టెస్ట్‌లో పెద్ద ఇన్నింగ్స్‌ ఆడి ఘనంగా రిటైర్‌ కావాలి. ఇలాంటి అవకాశం ప్రతి ఆటగాడికీ దక్కదు" అని వ్యాఖ్యానించాడు.

వివరాలు 

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి

ఇదే సమయంలో ఆస్ట్రేలియా మరో మాజీ క్రికెటర్‌ మ్యాథ్యూ హెడెన్‌ ఆసీస్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్ల వైఫల్యాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. లబుషేన్‌, ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్‌ గ్రీన్‌ వంటి కీలక ఆటగాళ్లు పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నారని హెడెన్‌ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 132 పరుగులకే ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో ఒక్క బ్యాటర్‌ కూడా కనీసం హాఫ్‌ సెంచరీ సాధించలేకపోవడం గమనార్హం.

Advertisement

వివరాలు 

బ్యాటర్లకంటే మన బౌలర్ల టెక్నిక్‌ మెరుగు 

ఈ విషయంపై హెడెన్‌ మాట్లాడుతూ, "ఈ స్కోర్‌కార్డు ఎవ్వరూ ఊహించలేదు. ట్రావిస్‌ హెడ్‌, వెదర్లాడ్‌, లబుషేన్‌, ఖవాజా, కేరీ, గ్రీన్‌ వంటి బ్యాటర్ల బేసిక్‌ టెక్నిక్‌లో లోపాలు కనిపిస్తున్నాయి. బ్యాటర్లకంటే మన బౌలర్ల టెక్నిక్‌ మెరుగ్గా ఉంది" అని విమర్శించాడు. యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో చివరి అయిన అయిదో టెస్ట్‌ మ్యాచ్‌ జనవరి 4 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.

Advertisement