మైఖేల్ జోర్డాన్ జెర్సీ వేలానికి రికార్డు స్థాయిలో ధర
ప్రఖ్యాత అమెరికా మాజీ బాస్కెట్ బాల్ ఛాంపియన్ మైకేల్ జోర్డాన్ జెర్సీ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్ లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు బాస్కెట్ బాల్ లెజెండ్ జోర్డాన్ ధరించిన జెర్సీకి వేలంలో రూ.3.03 మిలియన్లు ధర పలకడం విశేషం. గొల్డిన్ నిర్వహించిన ఆన్‌లైన్ వేలం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులను ఆకర్షించింది.లిథువేనియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచులో జోర్డాన్ ధరించిన ఈ జెర్సీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ జెర్సీపై ఆ జట్టులోని మొత్తం 12 మంది ఆటగాళ్లు సంతకం చేయడంతో దాన్ని వేలంలో ఉంచారు. ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు NBA ఆటగాళ్లను అనుమతించడం ఇదే మొదటిసారి. అప్పట్లో డ్రీమ్ టీమ్ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకం సాధించింది.
మైఖేల్ జోర్డాన్ కెరీర్ లో 1998 సీజన్ ఎంతో ప్రసిద్ధి
గతంలో 1998 NBA ఫైనల్స్ గేమ్ 1లో ధరించిన జెర్సీ వేలంలో 10.1 మిలియన్ల డాలర్ల భారీ ధరకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. భారత కరెన్సీ ప్రకారం సుమారు 80 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటివరకు విక్రయించిన అత్యంత విలువైన జెర్సీ ఇదేనని అప్పట్లో వేలం వేసిన సోథెబీస్ సంస్థ వెల్లడించింది. మైఖేల్ జోర్డాన్ కెరీర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన సీజన్ 1998. ఆ సీజన్‌లో జోర్డాన్ రెడ్ 23 జెర్సీని ధరించారు.