LOADING...
Satya Nadella: ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల  
ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల

Satya Nadella: ఫ్రీ టైంలో క్రికెట్ యాప్ పైన పని చేస్తున్న సత్య నాదెళ్ల  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 12, 2025
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ఎవరికైనా ఖాళీ సమయం దొరకగానే విశ్రాంతి తీసుకోవడం లేదా తమ హాబీలతో గడపడం సహజం. కానీ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాత్రం ఆ టైమ్‌ను కూడా కోడింగ్‌కే కేటాయిస్తారట! టెక్నాలజీపై ఆయనకున్న ప్రేమ ఎంతో తెలిసిన విషయమే. అదే స్థాయిలో క్రికెట్‌పై కూడా అపారమైన ఆసక్తి ఉంది. ఈ రెండు ఇష్టాలను కలిపి ఆయన చేసిన పని నిజంగా ప్రత్యేకం.

వివరాలు 

క్రికెట్‌ను లోతుగా విశ్లేషించేందుకు సత్య నాదెళ్ల రూపొందించిన AI యాప్ 

క్రికెట్ చరిత్రను, ఆటగాళ్ల ప్రదర్శనలను చాలా డీప్‌గా అర్థం చేసుకునేందుకు సత్య నాదెళ్ల స్వయంగా ఒక డీప్ రీసెర్చ్ AI యాప్ డెవలప్ చేశారట. ముఖ్యంగా తన ఖాళీ సమయంలోనే దీనిపై పనిచేసేవారట. దీనివల్ల ఆయన టెక్నాలజీపై ఉన్న పట్టు ఎంత ఉందో స్పష్టమవుతుంది. మేనేజ్మెంట్ పాజిషన్‌లో ఉన్నప్పటికీ, కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయడం ఆపలేదు.

వివరాలు 

AI తో "ఆల్-టైమ్ టెస్ట్ గ్రేట్" భారత జట్టును ఎంపిక 

భారత టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు ఆడిన ఉత్తమ జట్టును ఎంచేందుకు ఈ AI యాప్‌ను నాదెళ్ల ఉపయోగించారు. ఈ టూల్ ఒక క్రికెటర్ ప్రదర్శన, చర్చలు, గణాంకాలు- ఇలా అనేక అంశాలను అద్భుతంగా విశ్లేషించి చూపించగలదట. ఈ అనుభవం గురించి నాదెళ్ల మాట్లాడుతూ, "ఈ సిస్టమ్ పనిచేసిన తీరు చూసి నాకు కూడా Copilot టీమ్‌లో ఉద్యోగం దొరికితే బాగుండేది అనిపించింది" అని బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో చెప్పారు. కెప్టెన్ ఎంపికలో కూడా AI విస్తృత రీసెర్చ్ చేసి, విరాట్ కోహ్లీ ,ఎంఎస్ ధోని మధ్య తీవ్ర పోటి ఉన్నా... చివరికి విరాట్ కోహ్లినే బెస్ట్ కెప్టెన్‌గా ప్రకటించిందట.

Advertisement

వివరాలు 

నాదెళ్లకు క్రికెట్‌తో ప్రత్యేక అనుబంధం 

సత్య నాదెళ్ల కేవలం క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు. ఆయన కొన్ని క్రికెట్ జట్లలో పెట్టుబడులు కూడా పెట్టారు. ఇతర టెక్ నాయకులతో కలిసి ఒక క్రికెట్ ఫ్రాంచైజీ కోసం సుమారు 182 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. క్రికెట్ తనకు లీడర్‌షిప్, పట్టుదల, టీమ్ వర్క్ వంటి లక్షణాలను నేర్పిందని సత్య నాదెళ్ల చాలాసార్లు చెప్పారు. ఆయన భారతదేశంలోనే పుట్టి ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు.

Advertisement

వివరాలు 

మైక్రోసాఫ్ట్‌కి కూడా క్రికెట్‌కి ఉన్న ప్రాధాన్యం

రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని విస్తరించే సమయంలో అక్కడే ఒక క్రికెట్ గ్రౌండ్‌ను నిర్మించారు. అమెరికాలోని ఇంత పెద్ద కార్పొరేట్ కంపెనీ తమ క్యాంపస్‌లో రిక్రియేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారట! ప్రస్తుతం సత్య నాదెళ్ల భారతదేశంలో పర్యటిస్తూ, AI, క్లౌడ్ రంగాల్లో మైక్రోసాఫ్ట్‌ భవిష్యత్ పెట్టుబడులపై మాట్లాడుతున్నారు. ఇవే రెండు రంగాలను సంస్థ ప్రధాన దిశగా తీసుకెళ్తోంది.

Advertisement