IPL-2026: సన్‌రైజర్స్‌కు డబుల్ షాక్.. కమిన్స్ తర్వాత ఎడ్వర్డ్స్ ఔట్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్‌ను అదరగొట్టే బౌలింగ్‌తో ప్రారంభించాలని ఆశించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మొదటి వారంలో జరిగే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు సూచించాయి. దీంతో ఆస్ట్రేలియా పేసర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ తరహాలోనే స్టార్క్ కూడా కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమిన్స్, హేజిల్‌వుడ్ గాయాల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవుతుండగా, స్టార్క్ మాత్రం వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడు.
వివరాలు
ఇదే అసలు కారణమా!
గత సంవత్సరం మిచెల్ స్టార్క్‌పై అధిక పని భారం పడిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌లో అతను అన్ని మ్యాచ్‌లు ఆడాడు. బిగ్ బాష్ లీగ్‌లో కూడా అతను మంచి ప్రదర్శన కనబరిచాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక బంతులు వేసిన బౌలర్లలో అతను ముందంజలో ఉన్నాడు. టీ20ల్లో నాలుగు ఓవర్లే వేసినా, వాటిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. స్టార్క్‌పై పని భారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్ట్రేలియా జట్టు బోర్డు నిర్ణయించింది. అందుకే 'రిటర్న్ టు ప్లే' మార్గదర్శకాలను అనుసరించి, అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే ఆడించనున్నారు. ఈ కారణంగా మొదటి వారంలో జరిగే మ్యాచ్‌లకు అతను దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
సన్‌రైజర్స్‌కు మరో దెబ్బ
ఇప్పటికే స్టార్ పేసర్ పాట్ కమిన్స్ సేవలను కొన్ని మ్యాచ్‌లకు కోల్పోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టులోని ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని జట్టు వర్గాలు తెలిపాయి. అన్‌క్యాప్‌డ్ విదేశీ ఆటగాడిగా సన్‌రైజర్స్ గత వేలంలో అతడిని రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు.