
Champions Trophy 2025: పాకిస్థాన్‌లో స్టేడియాల ఆధునికీకరణ.. భారత్‌పై పీసీబీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మోసిన్ నక్వీ, టీమ్ ఇండియాపై అనేక విమర్శలు చేశారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గురించి మాట్లాడారు.
ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి, పాకిస్థాన్‌లో స్టేడియాలు సిద్ధం కాలేకపోవడంపై వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో, నక్వీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఐసీసీ విధించిన గడువులోగా, మైదానాలు సిద్ధం కావడం కష్టమని చెప్పిన వారిపై ఘాటు విమర్శలు చేశారు.
ఫిబ్రవరి 7 నాటికి గడాఫీ స్టేడియం సిద్ధమవుతుందని నక్వీ ప్రకటించారు. బయట నుంచి చేసే వ్యాఖ్యలు తమ పరిధిని దాటి పోతున్నాయని, పాక్ క్రికెట్ బోర్డుపై అనవసరమైన ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు.
పాక్ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ తరలిపోతుందని కూడా చెప్పారన్నారు.
Details
అన్ని జట్లకూ స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నాం
అయినా పీసీబీ అధ్యక్షుడిగా తాను భరోసా ఇస్తున్నానన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రమే కాదు, ట్రై సిరీస్‌ను కూడా విజయవంతంగా నిర్వహించగలమన్నారు.
విమర్శలు ఎన్ని ఉన్నా వెనకడుగు వేయమని, పీసీబీ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, అన్ని జట్లకూ స్వాగతం పలికేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, వారి భద్రత తమ బాధ్యత అని నక్వీ స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 16న లాహోర్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.
గత సంప్రదాయాలకు భిన్నంగా, ఈసారి కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్సులు, ఫొటోషూట్లు నిర్వహించవద్దని నిర్ణయించారు. ట్రావెలింగ్ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రారంభోత్సవానికి, సభ్య దేశాల క్రీడా మంత్రులు, అధికారులను ఆహ్వానం పంపిస్తామని, భారత ప్రతినిధులు కూడా పాల్గొంటారని నక్వీ చెప్పారు.