
Mohammad Nabi : ఆసియా కప్ 2025లో మహమ్మద్ నబీ సిక్సర్ల వర్షం.. తృటిలో యువీ రికార్డు మిస్..వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో సంచలనం నమోదయ్యాయంది. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్‌లో నబీ చెలరేగిపోయాడు. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లాలగె బౌలింగ్‌లో నబీ వరుసగా ఐదు సిక్సర్లు బాది.. కొద్దిలో టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్ రికార్డును మిస్ అయ్యాడు. రి ఓవర్‌లో నబి అద్భుత ప్రదర్శనతో అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్‌ను 20 ఓవర్లలో 169/8 భారీ స్కోరు వద్ద నిలిపాడు. నిజానికి, 19 ఓవర్ల తరువాత ఆఫ్ఘనిస్తాన్ 137/7తో కష్టాల్లో ఉండగా, 40 ఏళ్ల నబీ తన అనుభవాన్ని చూపించాడు.
వివరాలు
అఫ్గానిస్తాన్ స్కోరును పటిష్ట స్థితికి..
నబీ ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌లో అత్యంత సంచలన ప్రదర్శన చూపాడు. మొదట బంతిని లాంగ్ ఆఫ్ వైపు, ఆ తర్వాత రెండు సిక్సర్లను లాంగ్ ఆన్ వైపు కొట్టాడు. తరువాతి బంతిని డీప్ మిడ్ వికెట్ ద్వారా బౌండరీలోకి పంపాడు. ఇలా వరుస ఐదు బంతులను సిక్సర్లుగా మార్చిన నబీ, చివరి బంతిని కూడా సిక్సర్‌గా మార్చే అవకాశం వచ్చినా.. టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో ఒక్క సింగిల్‌కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ, ఆ ఓవర్‌లోనే మొత్తం 32 పరుగులు సాధించి అఫ్గానిస్తాన్ స్కోరును పటిష్ట స్థితికి చేర్చాడు.
వివరాలు
నబీ ఒక్కడే 14 బంతుల్లో 48 పరుగులు సాధించాడు
నబీ కేవలం 20 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసి, అఫ్గాన్ ఆటగాళ్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌తో కలసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డులో భాగస్వామ్యం అయ్యాడు. చివరికి 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అదనంగా,నబీ నూర్ అహ్మద్‌తో కలిసి ఎనిమిదో వికెట్ కోసం కేవలం 18 బంతుల్లో 55 పరుగులు జోడించాడు. వీటిలో నబీ ఒక్కడే 14 బంతుల్లో 48 పరుగులు సాధించాడు.మ్యాచ్ ఫలితానికి వస్తే, శ్రీలంక కేవలం 18.4 ఓవర్లలో 170 పరుగుల లక్ష్యాన్ని చేరి విజయం సాధించింది. ఫలితంగా ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ B నుండి పోటీ నుంచి అవుట్ అయింది.అదే సమయంలో, గ్రూప్ B నుండి శ్రీలంక,బంగ్లాదేశ్ జట్లు సూపర్ 4కు ప్రవేశించాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
22 బంతుల్లో 60 పరుగులతో మెరిసిన నబీ..
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 18, 2025
- 5 sixes in an over by a 40 year old Mohammad Nabi in Asia Cup 2025. 🤯pic.twitter.com/U5cnY0mr3y