
న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచిన నవాజ్, నసీమ్
ఈ వార్తాకథనం ఏంటి
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో పాక్ బౌలర్లు కివిస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. న్యూజిలాండ్ (49.5) ఓవర్లకు 262 పరుగులు చేసి, ఆలౌట్ అయింది. స్పిన్నర్లు మహ్మద్ నవాజ్, పేసర్ నసీమ్ షా ఇద్దరు కలిపి ఏడు వికెట్లు తీయడంతో కివీస్ బ్యాటింగ్ కుప్పకూలింది. షా మూడు కీలక వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ఒకానొక దశలో 183/1తో దూసుకెళ్తున్న న్యూజిలాండ్ భారీ స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. పాక్ బౌలర్ల ధాటికి కివిస్ బ్యాటర్లు పెవిలియానికి క్యూ కట్టారు.
రెండో వన్డేలో నవాజ్ 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. అతని ఎకానమీ రేట్ 3.80 మాత్రమే, నవాజ్ 24 వన్డేలో 36 వికెట్లు పడగొట్టాడు.
పాకిస్థాన్
78 పరుగులిచ్చి 9 వికెట్లు తీశారు
రైట్ ఆర్మ్ సీమర్ నసీమ్ 8.5 ఓవర్లకు 58 పరుగులు ఇచ్చారు. ఇందులో మూడు వికెట్లు తీశాడు. నసీమ్ అంతకుముందు (నెదర్లాండ్స్‌పై 5/35) సత్తా చాటిన విషయం తెలిసిందే.
నసీమ్ తన తొలి నాలుగు వన్డేల్లో 15 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 14 వికెట్లు తీసిన ర్యాన్ హారిస్, గ్యారీ గిల్మర్‌ల రికార్డును బద్దలు కొట్టాడు.
చివరి 20 ఓవర్లలో కేవలం 78 పరుగులు మాత్రమే ఇచ్చి పాక్ బౌలర్లు తొమ్మిది వికెట్లు తీశారు. నసీమ్, నవాజ్‌లతో పాటు హరీస్ రవూఫ్, ఉసామా మీర్ కూడా ఒక్కో వికెట్ తీశారు.