Page Loader
Mohammed Shami: మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. 
Mohammed Shami: మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ..

Mohammed Shami: మడమకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహమ్మద్ షమీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2024
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సోమవారం తన అకిలెస్ స్నాయువుకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని షమీ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఆపరేషన్‌ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను కూడా షమీ షేర్‌ చేశాడు. ICC ఈవెంట్ ఫైనల్ తరువాత షమీ మళ్ళీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. శస్త్రచికిత్స కారణంగా ఐపీఎల్‌ 2024కు షమీ దూరం అయ్యాడు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరుపున షమీ ఆడుతున్నాడు. జూన్ నెలలో జరిగే టీ20 ప్రపంచకప్‌ 2024 సమయానికి అందుబాటులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

షమీ చేసిన ట్వీట్