పవర్ ప్లేలో విజృంభిస్తున్న మహ్మద్ సిరాజ్
వన్డేలో టీమిండియా తరుపున హైదరాబాద్ స్టార్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ విజృంభిస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలను చూపిస్తున్నాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వికెట్లను రాబడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే, తొలి ఓవర్లోనే ట్రావిస్ హెడ్ (5)ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. కొత్తగా బంతిని వేగంగా స్వింగ్ చేయగలే సామర్థ్యం సిరాజ్‌కు ఉంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
సిరాజ్ అద్భుత రికార్డులివే
2022 తర్వాత పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మహ్మద్ సిరాజ్ నిలిచాడు. 2022 నుండి 21 వన్డేల్లో పవర్ ప్లేలోనే 26 వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఈ అరుదైన ఘనతను అతను సాధించాడు. సిరాజ్ వన్డే అరంగేట్రం జనవరి 2019లో ఆస్ట్రేలియాతో జరిగింది. ఈమ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా సాధించలేదు. అనంతరం వన్డేలోకి రావడానికి సిరాజ్‌కు రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటివరకూ సిరాజ్ 22 వన్డేలు ఆడి 19.95 సగటుతో 41 వికెట్లను తీశాడు. టీమిండియా విజయానికి 188 పరుగులు అవసరం