LOADING...
Asia Cup : ఆసియా కప్ ట్రోఫీ యూఏఈ బోర్డుకు అప్పగింత.. భారత్‎కు ఎప్పుడిస్తారంటే ?
ఆసియా కప్ ట్రోఫీ యూఏఈ బోర్డుకు అప్పగింత.. భారత్‎కు ఎప్పుడిస్తారంటే ?

Asia Cup : ఆసియా కప్ ట్రోఫీ యూఏఈ బోర్డుకు అప్పగింత.. భారత్‎కు ఎప్పుడిస్తారంటే ?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2025
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ విజయం సాధించినప్పటికీ, ట్రోఫీ ప్రెజెంటేషన్‌ను చుట్టూ అలుముకున్న వివాదం క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. బీసీసీఐ జారీ చేసిన తీవ్రమైన హెచ్చరికల తర్వాత, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చివరికి ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, భారత్ జట్టుకు ట్రోఫీ ఎప్పుడు అందుతుందో స్పష్టత లేకపోవడంతో, ఈ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఫైనల్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందించాల్సి ఉండగా, పాక్ మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు,ఏసీసీ అధ్యక్షుడు అయిన నఖ్వీ చేతుల మీదుగా అందుకోవడానికి భారత్ నిరాకరించింది. దీనితో పాటు, నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

వివరాలు 

బీసీసీఐకి క్షమాపణలు చెప్పలేదు, చెప్పను

బీసీసీఐ ఈ చర్యను ఏసీసీ ప్రవర్తనా నియమాలు, ప్రోటోకాల్‌ల ఉల్లంఘనగా ఖండించింది. దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయానికి ట్రోఫీని తీసుకురావాలని కోరినప్పటికీ, నఖ్వీ నిరాకరించారు. ఆయన స్వయంగా అధికారిక వేడుకలో ట్రోఫీని అందుకోవచ్చని ప్రతిపాదించినప్పటికీ, భారత్ దానిని తిరస్కరించింది. "బీసీసీఐకి క్షమాపణలు చెప్పలేదు, చెప్పను" అని నఖ్వీ గతంలో ప్రకటించాడు, భారతీయ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించాడు. బీసీసీఐ ఈ చర్యను ఏసీసీ ప్రవర్తనా నియమాలు, ప్రోటోకాల్‌ల ఉల్లంఘనగా ఖండించింది. దుబాయ్‌లోని ఏసీసీ ప్రధాన కార్యాలయానికి ట్రోఫీని తీసుకురావాలని కోరినప్పటికీ, నఖ్వీ నిరాకరించారు.

వివరాలు 

బీసీసీఐ చర్యలు

తన చేతుల మీదుగా అధికారిక కార్యక్రమంలో ట్రోఫీని స్వీకరించవచ్చని నఖ్వీ ప్రతిపాదించినప్పటికీ, భారత్ దానిని తిరస్కరించింది. బీసీసీఐ ప్రకారం, నఖ్వీ వ్యవహారం సరిహద్దులను దాటింది. ఆయనను ఏసీసీ అధ్యక్ష పదవీ నుంచి తొలగించడానికి బీసీసీఐ చర్యలు చేపట్టింది. నవంబరులో జరిగే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో నఖ్వీకు తీవ్రమైన ఎదురుదెబ్బ తగలవచ్చని బీసీసీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ క్రికెట్ బోర్డుకు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ట్రోఫీ భారత్‌కు ఎప్పుడు అందుతుందనే విషయంలో స్పష్టత లేదు.

వివరాలు 

భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్ట్‌లు ఈ వివాదానికి ప్రధాన కారణాలు 

మంగళవారం నిర్వహించిన ఏసీసీ వర్చువల్ సమావేశంలో బీసీసీఐ ప్రతినిధులు రాజీవ్ శుక్లా,ఆశిష్ షెలార్ నఖ్వీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నఖ్వీ ఏసీసీ ఛైర్మన్‌గా మాత్రమే కాకుండా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు,పాకిస్తాన్ హోంమంత్రి కూడా కావడం,ఆయన చేసే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు ఈ వివాదానికి ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి. ఈ కారణాల వల్లనే భారత జట్టు నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి నిరాకరించింది. ఫైనల్ ప్రెజెంటేషన్ వేడుక సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యం అయినప్పటికీ, పాకిస్తాన్ జట్టు రన్నరప్ అవార్డులు,మెడల్స్‌ను స్వీకరించింది. మ్యాచ్ ముగిసినప్పటికీ,మైదానం వెలుపల క్రికెట్ రాజకీయాలు ఇంకా కొనసాగుతున్నాయి. నఖ్వీ భవిష్యత్తు, ఆసియా కప్ ట్రోఫీ వితరణపై స్పష్టత రావాల్సి ఉంది.