LOADING...
MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక  
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక

MP Keshineni: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని ఏకగ్రీవంగా ఎన్నిక  

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ వార్తను లెమన్ ట్రీ హోటల్‌లో జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్ అనంతరం అధికారికంగా వెల్లడించారు. ఇతర ప్యానెల్ల నుంచి నామినేషన్‌లు దాఖలు కాకపోవడంతో కేశినేని ప్యానెల్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఏసీఏలోని కీలక పదవుల్లో వెంకట ప్రశాంత్ ఉపాధ్యక్షుడిగా, సానా సతీష్ కార్యదర్శిగా, విష్ణుకుమార్ రాజు జాయింట్ సెక్రటరీగా, దండమూడి శ్రీనివాస్ కోశాధికారిగా, గౌరు విష్ణుతేజ్ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. కొత్త కార్యవర్గం తన తొలి నిర్ణయంగా వరద బాధితులకు సాయపడాలని నిర్ణయించింది. అందులో భాగంగా, సీఎం సహాయనిధికి రూ. కోటి విరాళాన్ని ప్రకటించింది.

వివరాలు 

శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని ఏసీఏ కార్యవర్గం ఆగస్టు 4న రాజీనామా

గతంలో, శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని ఏసీఏ కార్యవర్గం ఆగస్టు 4న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేశినేని ప్యానెల్ నుంచి మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో, ఈ నెల 17న కొత్త కార్యవర్గం ఖరారైంది. ఫలితాల అధికారిక ప్రకటన కోసం మాత్రం కొంత కాలం వేచి ఉండాల్సి వచ్చింది.