Loading...
Michael Hussey: ఆస్ట్రేలియా జట్టులోకి 'మిస్టర్ క్రికెట్'.. టీ20 అడ్వైజర్‌గా మైఖేల్ హస్సీ!
ఆస్ట్రేలియా జట్టులోకి 'మిస్టర్ క్రికెట్'.. టీ20 అడ్వైజర్‌గా మైఖేల్ హస్సీ!

Michael Hussey: ఆస్ట్రేలియా జట్టులోకి 'మిస్టర్ క్రికెట్'.. టీ20 అడ్వైజర్‌గా మైఖేల్ హస్సీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 06, 2026
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచింగ్ బృందంలో మాజీ దిగ్గజ బ్యాటర్, 'మిస్టర్ క్రికెట్'గా పేరుగాంచిన మైఖేల్ హస్సీ చేరాడు. ఆండ్రూ మెక్‌డొనాల్డ్ నేతృత్వంలోని కోచింగ్ బృందంలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. కన్సల్టెంట్ కోచ్‌తో పాటు టీ20 అడ్వైజర్‌గా హస్సీ వ్యవహరించనున్నాడు. గతంలోనూ ఆస్ట్రేలియా జట్టుకు సలహాదారుగా పనిచేసిన ఆయన.. ఈసారి మరింత కీలక పాత్రలో జట్టుతో కలిసి పనిచేయనున్నారు.

వివరాలు

2027 యాషెస్, వన్డే ప్రపంచకప్‌పై ప్రత్యేక దృష్టి

రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా జట్టు ఆడనున్న కీలక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని హస్సీ నియామకం జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా 2027లో జరగనున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన సేవలను ఉపయోగించుకోనున్నారు.

టీ20 ఫార్మాట్‌లో జట్టు ప్రదర్శనను మెరుగుపరిచేందుకు హస్సీ ప్రత్యేకంగా పనిచేయనున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో ఆయన తన కొత్త బాధ్యతలను ప్రారంభించనున్నాడు.

అనంతరం పెర్త్‌లో జరిగే టెస్టు మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టును సిద్ధం చేయడంలోనూ కీలకంగా వ్యవహరించనున్నాడు.

వివరాలు

ఇంగ్లండ్ కోచ్ ఆహ్వానాన్ని తిరస్కరించిన హస్సీ

మైఖేల్ హస్సీకి ఇంగ్లండ్ జట్టు కోచింగ్ బృందంలో పనిచేసే అవకాశం కూడా వచ్చింది.

ఇటీవలే ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన స్టీఫెన్ ఫ్లెమింగ్.. తన కోచింగ్ బృందంలో చేరాలని హస్సీని ఆహ్వానించాడు.

అయితే ఈ ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించాడు. తన స్వదేశమైన ఆస్ట్రేలియా జట్టుకే సేవలు అందించాలనే నిర్ణయం తీసుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

చెన్నై సూపర్ కింగ్స్‌కు హస్సీ గుడ్‌బై!

ఆస్ట్రేలియా జట్టుతో కొత్త బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో మైఖేల్ హస్సీ ఐపీఎల్‌లో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.

చాలా కాలంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేస్తున్న ఆయన.. ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.

ఇకపై పూర్తిస్థాయిలో ఆస్ట్రేలియా జట్టుపైనే దృష్టి సారించనున్నాడు. తనకున్న అపారమైన క్రికెట్ అనుభవాన్ని, సమయాన్ని జట్టు విజయాల కోసం వినియోగించనున్నాడు.

దీంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో హస్సీ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు.

ADVERTISEMENT