Loading...
MS Dhoni: ఐపీఎల్‌ భవిష్యత్తుపై ధోని కీలక సంకేతాలు.. డిసెంబర్‌లోపు నిర్ణయం!
ఐపీఎల్‌ భవిష్యత్తుపై ధోని కీలక సంకేతాలు.. డిసెంబర్‌లోపు నిర్ణయం!

MS Dhoni: ఐపీఎల్‌ భవిష్యత్తుపై ధోని కీలక సంకేతాలు.. డిసెంబర్‌లోపు నిర్ణయం!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2026
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే) స్టార్‌ ఆటగాడు ఎంఎస్‌ ధోని తన ఐపీఎల్‌ భవిష్యత్తుపై ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్‌ 2027లో ఆడతాడా? లేదా? అనే అంశంపై డిసెంబర్‌లోపు నిర్ణయం తీసుకుంటానని సంకేతాలిచ్చాడు. దీంతో వచ్చే సీజన్‌లో మాహీ మైదానంలో కనిపిస్తాడా? అనే చర్చ మరోసారి మొదలైంది. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ధోనిని తన క్రికెట్‌ భవిష్యత్తు గురించి ప్రశ్నించగా.. తన ఫిట్‌నెస్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.

వివరాలు 

ఫిట్‌నెస్‌ పరీక్షల తర్వాతే నిర్ణయం

తన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు మరికొన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని ధోని తెలిపాడు.

వైద్యులు తుది నివేదిక ఇచ్చిన తర్వాత తన ఫిట్‌నెస్‌ స్థాయిని పరిశీలించి, మరో సీజన్‌ ఆడగలనా? లేదా? అనేది డిసెంబర్‌లోపు నిర్ణయించుకుంటానని వివరించాడు.

నేను ఆడలేని పరిస్థితిలో ఉంటే.. ఈ పాత వాహనం రోడ్డుపై సజావుగా నడవాలంటే వైద్యులు అవసరమైన మరమ్మతులన్నీ చేయాలని, మొత్తం బాధ్యత వారిపైనే ఉందని నవ్వుతూ చెప్పాడు.

వివరాలు 

ధోని కొనసాగింపుపై సీఎస్కే ఆశలు

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లోనూ ధోని తమ జట్టు తరఫున ఆడతాడని చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ఆశిస్తోంది.

అయితే అతడి భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని ధోనికే వదిలేసింది.

ఈ విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పందిస్తూ.. ధోని నిర్ణయం గురించి అతడినే అడగాలని పేర్కొన్నారు.

చెన్నైకి వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని జట్టు యాజమాన్యానికి తెలియజేస్తాడని చెప్పారు.

ధోని సీఎస్కే తరఫున కొనసాగించే అవకాశాలు ఉన్నాయని తనకు అనిపిస్తోందని, అతడు ఇప్పటికీ ఆటగాడేనని వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

వివరాలు 

గత సీజన్‌లో గాయంతో ఇబ్బందులు

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో కాలి కండరాల సమస్యల కారణంగా ధోని జట్టుకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయాడు.

మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేక ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు.

దీంతో రాబోయే సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును పునర్నిర్మించడంపై ఫ్రాంచైజీ దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో ధోని వచ్చే సీజన్‌లో ఆడతాడా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

వైద్య పరీక్షల ఫలితాలు, తన ఫిట్‌నెస్‌ను పరిశీలించిన తర్వాతే మాహీ తన భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వనున్నాడు.

ADVERTISEMENT