Page Loader
MS Dhoni: రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో  ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్‌!
రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్‌!

MS Dhoni: రాంచీలోని లోకల్ ధాబాలో స్నేహితులతో  ఎంఎస్ ధోని.. ఫొటో వైరల్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2024
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ కెప్టెన్, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్వస్థలం రాంచీలో తన స్నేహితులతో కలిసి ఓ లోకల్‌ ధాబాలో లంచ్‌ను ఎంజాయ్‌ చేశారు. ధోనీ తన స్నేహితుల‌తో క‌లిసి చిల్‌ అవుతున్న ఫొటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్నేహితులతో సరదాగా కాసేపు ముచ్చటించి టైమ్‌ స్పెండ్‌ చేశారు. ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఏకంగా ఐదుసార్లు చాంపియ‌న్‌గా నిలిపాడు. 2024లో 17వ సీజ‌న్‌కు ముందు చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్సీ వ‌దిలేశాడు. త‌న వార‌సుడిగా యువ ఆట‌గాడు రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రక‌టించి వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగాడు. 17వ సీజ‌న్‌లో మోకాలి నొప్పితో బాధ‌ప‌డుతూనే సీజ‌న్ మొత్తం ఆడాడు.

వివరాలు 

ధోనీ భవిష్యత్తులో CSKతో ఆడ‌డంపై సందేహాలు

అయితే, ప్ర‌స్తుతం ధోనీ మ‌రో ఐపీఎల్ సీజ‌న్ ఆడ‌డంపై సందేహాలు నెలకొన్నాయి. ఏ స‌మ‌యంలోనైనా అత‌డు రిటైర్మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ధోనీ ఐపీఎల్ 2025 సీజ‌న్ ఆడ‌తాడా లేదా అని అభిమాన‌లు టెన్ష‌న్ గా ఎదురుచూస్తున్నారు. కాగా, ధోనీ 18వ సీజ‌న్‌లో కొత్త అవ‌తారంలో సీఎస్‌కేకి అండ‌గా నిలిచే అవ‌కాశ‌ముందని క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్నేహితులతో సరదాగా గడుపుతున్న ఎంఎస్ ధోని