Loading...
IPL: ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!
ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!

IPL: ముంబై తుది జట్టులో స్టార్ ప్లేయర్లకు షాక్.. ఈ ఐదుగురికి అవకాశం లేదు!

వ్రాసిన వారు Moogati Shabari
Mar 20, 2026
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తమ ఆరవ టైటిల్ కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఉన్న ఈ జట్టు ఈసారి వేలంలో బలమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నప్పటికీ, తుది జట్టు ఎంపిక మాత్రం సులభం కానట్టే కనిపిస్తోంది. జట్టులో సమతుల్యతను కాపాడేందుకు కొంతమంది ప్రముఖ ఆటగాళ్లను కూడా బెంచ్‌పైనే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఐదు సీజన్లుగా టైటిల్ దక్కకపోవడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని హార్థిక్ పాండ్యా సంకల్పంతో ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో కొందరికి జట్టులో చోటు దక్కే అవకాశం కష్టంగా మారనుంది.

వివరాలు

శార్దూల్ ఠాకూర్

ముంబై జట్టులో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి అగ్రశ్రేణి పేసర్లు ఉన్నారు.

అదనంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్‌లో భాగస్వామ్యం అవుతాడు.

ఈ నేపథ్యంలో శార్దూల్ ఠాకూర్‌కు తుది జట్టులో చోటు దక్కడం చాలా క్లిష్టంగా మారింది.

ప్రధాన పేసర్లలో ఎవరైనా గాయపడితే తప్ప అతనికి అవకాశాలు రావడం కష్టమే.

వివరాలు

రాబిన్ మింజ్

జార్ఖండ్‌కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్‌ను భవిష్యత్తు ప్రతిభగా ముంబై చూస్తోంది.

అయితే క్వింటన్ డి కాక్ వంటి అనుభవజ్ఞుడు జట్టులో ఉన్నాడు.

అలాగే ర్యాన్ రికెల్టన్ కూడా అందుబాటులో ఉన్నాడు.

దీంతో ఈ సీజన్‌లో మింజ్‌కు ఎక్కువ అవకాశాలు లభించకపోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

కార్బిన్ బాష్

దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్‌ను జట్టు బ్యాకప్‌గా తీసుకుంది.

విదేశీ ఆటగాళ్ల కోటా పరిమితంగా ఉండటంతో విల్ జాక్స్, మిచెల్ సాంట్నర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వంటి ప్రముఖుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది.

అందువల్ల బాష్‌కు తుది జట్టులో స్థానం దక్కడం కష్టమే.

అయితే కొందరు మాత్రం బాష్‌తో కొన్ని మ్యాచులు అయినా ఆడించాలని సూచనలిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

రాజ్ అంగద్ బావా

అండర్-19 వరల్డ్ కప్‌లో మెరిసిన రాజ్ బావా మంచి ప్రతిభ కలిగిన ఆల్‌రౌండర్.

అయినప్పటికీ జట్టులో ఇప్పటికే హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞుడు ఉండటంతో అతనికి స్థానం లభించడం కష్టంగా మారింది.

అతడిని ప్రధానంగా బ్యాకప్‌గా మాత్రమే ఉపయోగించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే కొన్ని మ్యాచుల్లో అతను ఆడే అవకాశం కనిపిస్తోంది.

వివరాలు

నమన్ ధీర్

గత సీజన్‌లో తన దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్న నమన్ ధీర్‌కు ఈసారి పోటీ మరింత గట్టిగా ఉంది.

మిడిల్ ఆర్డర్‌లో విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు.

అయితే ఒకటి రెండు మ్యాచులు ఆడే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT