Page Loader
ఐపీఎల్ 2023లో పడిలేచిన ముంబై ఇండియన్స్.. జర్నీ సాగిందిలా..!
ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించిన ముంబై జట్టు

ఐపీఎల్ 2023లో పడిలేచిన ముంబై ఇండియన్స్.. జర్నీ సాగిందిలా..!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2023
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. సీజన్ మొదటి అర్ధభాగంలో అశించిన స్థాయిలో రాణించని ముంబై.. సరైన సమయంలో విజయాలను సాధించి సత్తా చాటింది. ఇక ఎలిమినేటర్‌ మ్యాచులో భాగంగా లక్నో సూపర్ జెయింట్‌తో ముంబై జట్టు తలపడనుంది. జస్ప్రిత్ బుమ్రా ఈ సీజన్ కు దూరమైన ముంబై జట్టు స్ట్రాంగ్ గా నిలిచింది. ముంబై మొదటి ఏడు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయి బలహీన పడింది. అయితే తదుపరి ఏడు మ్యాచుల్లో ఐదింట్లో నెగ్గి ఫ్లే ఆఫ్స్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది. ముంబై తరుపున సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిసాన్, కామెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా అద్భుతంగా రాణించారు.

Details

ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్, గ్రీన్, ఇషాన్ కిషాన్

14 మ్యాచుల్లో ఎనిమిది విజయాలు సాధించి, నెట్ రన్ రేట్ -0.044తో, MI నాల్గవ స్థానంలో నిలిచింది. ప్రారంభంలో పేలవ ఫామ్ ను కొనసాగించిన సూర్యకుమార్ యాదవ్ తర్వాతి మ్యాచుల్లో చెలరేగిపోయాడు. ఈ సీజన్లో 185.14 స్ట్రైక్ రేట్‌తో 511 పరుగులు చేశాడు. ఇసాన్ కిషాన్ 439 పరుగులు, కామెరాన్ గ్రీన్ 381 పరుగులతో ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించారు. వెటరన్ లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా 7.81 ఎకానమీతో 20 వికెట్లను పడగొట్టాడు. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ 10 మ్యాచుల్లో 14 వికెట్లను తీశాడు. అతను పవర్ ప్లేలోనే ఎనిమిది వికెట్లు తీయడం గమనార్హం. ఐపీఎల్ ట్రోఫీని ముంబై నెగ్గాలంటే మూడు విజయాలను సాధించాలి