Page Loader
81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం 
81పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం

81 పరుగుల తేడాతో లక్నోపై ముంబయి ఇండియన్స్ భారీ విజయం 

వ్రాసిన వారు Stalin
May 24, 2023
11:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఎలిమినేటర్ గేమ్‌లో బుధవారం లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది. 81రన్స్ తేడాతో భారీ విజయాన్ని ముంబై అందుకుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రోహిత్ సేన తలపడనుంది. తొలుత టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డెత్ ఓవర్లలో నెహాల్ వధేరా చక్కటి ఆటతీరుతో ముంబై నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్నోకు 183 పరుగులను నిర్దేశించారు. మద్వాల్ 5వికెట్లతో విజృంభించడంతో లక్నో జట్టును 101పరుగులకే ముంబై ఆలౌట్ చేసింది. ముఖ్యంగా కీలక సమయాల్లో రనౌట్లు లక్నోను కోలుకోలేని దెబ్బ తీశాయి. ముంబయి జట్టులో గ్రీన్ 41పరగులు, లక్నోలో స్టాయినీస్ 40పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రోహిత్ సేన ఢీ