LOADING...
Sanju Samson: నా శతకం కోచ్‌కే అంకితం.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్
నా శతకం కోచ్‌కే అంకితం.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్

Sanju Samson: నా శతకం కోచ్‌కే అంకితం.. సంజు శాంసన్ ఎమోషనల్ కామెంట్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ క్యాపిటల్స్‌పై జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.మూడు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన సంజు శాంసన్ ఈసారి (115*) పరుగులతో సెంచరీ చేసి సత్తా చాటాడు. ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తనపై విశ్వాసం ఉంచిన ఫ్రాంచైజీకి కృతజ్ఞతలు తెలిపిన సంజు, ఈ శతకాన్ని ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు అంకితం చేస్తున్నట్లు వెల్లడించాడు. వైఫల్యాల నుంచి నేర్చుకోవడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నాడు. ఫ్రాంచైజీ నాపై నమ్మకం ఉంచి భారీ మొత్తంతో జట్టులోకి తీసుకుంది. అందుకు తగిన ప్రదర్శన ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా ఎవరూ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు ఈ సెంచరీతో ఆ ఒత్తిడి కొంత తగ్గింది.

వివరాలు

మేనేజ్‌మెంట్ నుంచి పూర్తి మద్దతు ఉంది

మేము ఇంకా టోర్నీలో పోటీ పడుతున్నామని చెప్పగలను. కొత్త ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నప్పుడు ప్రారంభంలోనే విఫలమైతే తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. కానీ మా మేనేజ్‌మెంట్ పూర్తి మద్దతు ఇచ్చింది. ఈ జట్టు నాకు మరో ఇంటిలా అనిపిస్తోంది. ఇక్కడి అభిమానులు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మూడు మ్యాచ్‌లు ఓడిపోయినా, ఈ మ్యాచ్‌కు ముందు కేవలం 50 సెకన్ల మీటింగ్ మాత్రమే జరిగింది. ఇది ఆటగాళ్లపై మేనేజ్‌మెంట్ ఉంచిన విశ్వాసానికి నిదర్శనం. నేను మొదట్లో విఫలమైనా, ఆ అనుభవం నుంచి నేర్చుకుని తిరిగి రాణించడం ఆనందంగా ఉంది. దానికి గాను గేమ్ ప్లాన్ మార్చుకుని, ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఆడాను. ప్రస్తుతం నా వయసు 31 సంవత్సరాలు.

వివరాలు

సీఎస్కే తరుపున తొలి సెంచరీ చేయడం ఆనందంగా ఉంది

ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడాలి. అందుకే నా బలాలను గుర్తించి, మానసికంగా కూడా మెరుగుపడేందుకు శ్రమించానని సంజు వివరించాడు. ఇక యువ ఆటగాడు ఆయుష్ మాత్రేతో కలిసి నిర్మించిన భాగస్వామ్యం కీలకమని సంజు తెలిపాడు. 'ఆయుష్ ఆట చూసి అతను అండర్-19 స్థాయి నుంచి వచ్చిన ఆటగాడిలా అనిపించలేదు. చాలా పరిణతి ప్రదర్శించాడు. లెక్కచేసి సిక్సర్లు బాదాడు. అతడు అద్భుత ప్రతిభ కలిగిన క్రికెటర్ అని ప్రశంసించాడు. అలాగే సీఎస్‌కే తరఫున తన తొలి సెంచరీ నమోదు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.

Advertisement

వివరాలు

జట్టును ఐదేళ్ల పాటు నడిపించిన అనుభవం ఉంది

ఈ శతకాన్ని ప్రత్యేకంగా ఒకరికి అంకితం చేయాలనుకుంటున్నాను. నేను విఫలమైనప్పటికీ ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉన్న ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కే ఈ సెంచరీని అంకితం చేస్తున్నాను. నేను కూడా ఒక జట్టును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉంది. అందులో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు నాకు తెలుసు. ప్రతి ఓటమి తర్వాత బయట నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే ఈ విజయాన్ని మా కోచ్‌కే అంకితం చేస్తున్నానని సంజు శాంసన్ వెల్లడించాడు.

Advertisement