LOADING...
WPL: మహిళల ఐపీఎల్‌లో చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ నందిని శర్మ
మహిళల ఐపీఎల్‌లో చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ నందిని శర్మ

WPL: మహిళల ఐపీఎల్‌లో చరిత్ర తిరగరాసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ నందిని శర్మ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
02:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ఐపీఎల్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్రను తిరగరాసింది. ఒకే సీజన్‌లో అత్యధిక వికెట్లు తీయడం ద్వారా భారత బౌలర్‌గా రికార్డ్‌ స్థాపించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది. ఇషాఖీ 2023 ఎడిషన్‌లో 15 వికెట్లు సాధించినప్పటికీ, ప్రస్తుత 2026 ఎడిషన్‌లో నందిని 16 వికెట్లతో కొత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ ఘనతను నందిని శర్మ గుజరాత్ జెయింట్స్‌తో నిన్న (ఫిబ్రవరి 3) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సాధించింది. ఆ మ్యాచ్‌లో ఆమె 2 వికెట్లు తీసి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు.

వివరాలు 

డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్‌-4)

నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్‌)- 16 వికెట్లు (2026) సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్‌)- 15 (2023) శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్‌)- 14 (2026) శ్రేయాంక పాటిల్‌ (ఆర్సీబీ)- 13 (2024) హ్యాట్రిక్‌ : ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడినా, నందిని హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. ఈ సీజన్‌లో ఢిల్లీ విజయంలో నందినీ కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. 24 ఏళ్ల రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను ఢిల్లీ ఈ సీజన్ వేలంలో 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

వివరాలు 

ఎలిమినేటర్ మ్యాచ్ వివరాలు:

నిన్న ఢిల్లీ గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో సీజన్‌లో ఫైనల్‌ చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్, బెత్ మూనీ (62 నాటౌట్‌) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి 1 వికెట్‌ తీశారు. తరువాత 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లతో సులభంగా అధిగమించింది. లిజెల్ లీ (43), జెమీమా రోడ్రిగ్స్ (41) ముఖ్యమైన ఇన్నింగ్స్‌ ఆడగా, ఢిల్లీ విజయాన్ని ఖాయం చేశారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరిగే ఫైనల్‌లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది.

Advertisement