ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంపై నవోమి ఒసాకా క్లారిటీ
జపాన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్, మాజీ వరల్డ్ నంబర్ వన్ నవోమి ఒసాకా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. 2019, 2021లో ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నవోమి ఒసాకా నిలిచింది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్ని ప్రారంభం కానున్న నేథప్యంలో ఓసాకా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై నిర్వాహకులను షాక్ గురి చేసింది. తాజాగా ఆమె తల్లిని కాబోతున్నట్లు తెలిపారు. దీంతో టోర్నికి దూరమయ్యాయని స్పష్టం చేసింది. నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఆమె తన ప్రియుడు కోర్డేతో బిడ్డకు జన్మనివ్వబోతోంది. వారిద్దరూ 2019 నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అంతేకాకుండా ఒసాకా సెప్టెంబరు 2022 నుండి WTA టూర్‌లో కూడా ఆడలేదు.
ప్రసూతి సెలవులు తీసుకున్న జాబితాతలో ఒసాకా
తాను తిరిగి కోర్టులోకి రావడానికి కొంచెం సమయం పడుతుందని, కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండడం వల్ల నాకు కొత్త బంధం దగ్గరయ్యే అవకాశం ఉందని ఒసాకా వెల్లడించింది. జనవరి 16 నుండి ప్రారంభమయ్యే 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ నుండి ఒసాకా గతంలో కారణం చెప్పకుండానే వైదొలిగింది. గతేడాది సెప్టెంబరులో ఆమె అనారోగ్యం కారణంగా పాన్ పసిఫిక్ ఓపెన్‌లో బీట్రిజ్ హద్దాద్ మైయాతో జరిగిన మ్యాచ్ నుండి వైదొలిగింది. అంతకు ముందు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రసూతి సెలవు తీసుకున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌ల జాబితాలో ఒసాకా కూడా చేరింది.