LOADING...
WPL: రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం
రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం

WPL: రాణించిన హేలీ, నాట్‌సీవర్‌ .. గుజరాత్‌పై ముంబై విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
08:14 am

ఈ వార్తాకథనం ఏంటి

డబ్ల్యూపీఎల్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించింది. హేలీ మాథ్యూస్ (3/16), అమేలియా కెర్ (2/22), నాట్‌సీవర్ (2/26) ధాటికి గుజరాత్ 20 ఓవర్లలో కేవలం 120 పరుగులకే ఆలౌటైంది. హర్లీన్ డియోల్ (32; 31 బంతుల్లో 4×4) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచింది. అనంతరం నాట్‌సీవర్ (57; 39 బంతుల్లో 11×4) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ముంబయి 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ అద్భుత ప్రదర్శనకు హేలీ మాథ్యూస్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.

వివరాలు 

ముంబయి అలవోకగా 

నాట్‌సీవర్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ముంబయి లక్ష్యాన్ని ఎలాంటి ఆటుపోటు లేకుండా చేరుకుంది. మ్యాచ్ ప్రారంభంలో ముంబయికి పరుగులు వేగంగా రాలేదు. 6 ఓవర్ల ముగిసే సమయానికి స్కోరు 37/1గా ఉంది. కానీ నాట్‌సీవర్ తన ఆటను ముమ్మరం చేస్తూ వరుసగా బౌండరీలు బాదింది. అయితే,యాస్తిక (8), హర్మన్‌ప్రీత్ (4)త్వరగానే ఔటయ్యారు.దాంతో 8 ఓవర్లకు ముంబయి స్కోరు 55/3గా మారింది. అయినప్పటికీ,నాట్‌సీవర్ తన ధాటిని కొనసాగిస్తూ గుజరాత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అమేలియా కెర్ (19)తో కలిసి నాలుగో వికెట్‌కు 45 పరుగులు జోడించి ముంబయిని విజయానికి చేరువ చేసింది. జట్టు స్కోరు 114 వద్ద నాట్‌సీవర్ ఐదో వికెట్‌గా వెనుదిరిగినా,చివరకు సజన (10 నాటౌట్),కమలిని (4 నాటౌట్) విజయాన్ని లాంఛనంగా ముగించారు.

వివరాలు 

గుజరాత్‌ను కట్టడి చేసిన ముంబయి బౌలర్లు 

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జట్టు దూకుడుగా ఆడాలని ప్రయత్నించింది. కానీ ముంబయి బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. హేలీ మాథ్యూస్ తన అద్భుతమైన ఆఫ్‌స్పిన్‌తో ప్రభావం చూపింది. గుజరాత్ ఇన్నింగ్స్‌ను నాట్‌సీవర్ తన రెండో ఓవర్లో బెత్ మూనీ (1)ను ఔట్ చేయడం ద్వారా కూల్చింది. వెంటనే వోల్వార్ట్ (4)ను షబ్నిమ్ వెనక్కి పంపింది. ఆ తర్వాత హేమలత (9)ను హేలీ, ఆష్లీ గార్డ్నర్ (10)ను నాట్‌సీవర్ ఔట్ చేశారు. పవర్‌ప్లే ముగిసే సమయానికి గుజరాత్ 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

వివరాలు 

 హేలీ, అమేలియా విజృంభించడంతో.. 

ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. హేలీ, అమేలియా విజృంభించడంతో గుజరాత్‌కి ఒంటరి భాగస్వామ్యాలే మిగిలాయి. హర్లీన్ డియోల్ ఒంటరిగా నిలవడంతో గుజరాత్ 100 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. జట్టు స్కోరు 103 వద్ద హర్లీన్, తనూజ (13) ఔటయ్యారు. చివర్లో సయాలి (13 నాటౌట్), ప్రియా మిశ్రా (2) చివరి వికెట్‌కు 17 పరుగులు జోడించడంతో గుజరాత్ 120 పరుగుల వద్ద ఆలౌటైంది.