Page Loader
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్
అవార్డుకు ఎంపికైన ఆసిఫ్ ఖాన్

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2023
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ మైదానంలో గొప్ప క్రీడాస్ఫూర్తిని చాటుకోవడంతో అరుదైన గౌరవం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌కి చెందిన బ్యాటర్ ఆండీ మెక్‌బ్రైన్ పరుగు తీసే క్రమంలో మధ్యలో పడిపోయాడు. అతడ్ని రనౌట్ చేసే అవకాశం ఉన్నా ఆసిఫ్ చేయలేదు. దీంతో నేపాల్ వికెట్ కీపర్ ఆసిఫ్ షేక్ ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. అప్పట్లో ఆసిఫ్ క్రీడాస్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురిసింది. ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును ప్రతేడాది ఆటగాడు, ఆటస్ఫూర్తిని నిలబెట్టే జట్టుకు అందజేస్తారు. 2022 కి సంబంధించి అవార్డును క్రీడాస్ఫూర్తిని చాటుకున్న ఆసీఫ్‌ఖాన్‌కి ఇచ్చారు.

నేపాల్

అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది

19వ ఓవర్ వేసిన నేపాల్ బౌలర్ కమల్, మూడో బంతిని ఐర్లాండ్ బ్యాటర్ మార్క్ ఆడైర్ హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి మిడాన్ దిశగా వెళ్లింది. దాంతో.. సింగిల్ కోసం నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని మెక్‌బ్రైన్‌ని ఆడైర్‌ పిలవగా.. అతను రియాక్ట్ అయ్యి పిచ్ మధ్యలో పడిపోయాడు. వేగంగా బంతిని అందుకున్న కమల్.. రనౌట్ కోసం కీపర్‌ ఆసిఫ్‌కి బంతిని అందించాడు. అప్పటికి క్రీజుకి చాలా దూరంలో ఉన్న అతడ్ని రనౌట్ చేసేందుకు ఆసిఫ్ నిరాకరించాడు. ఈ అవార్డును అందుకోవడం తనకు గర్వగా ఉందని, తన కోచ్‌లు ఎప్పుడూ మైదానంలో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించినట్లు ఆసీఫ్ తెలిపారు.