Yuzvendra Chahal: పంజాబ్ కింగ్స్‌తో కొత్త ప్రయాణం.. చాహల్ కీలక వ్యాఖ్యలు
భారత మణికట్టు మాంత్రికుడు యుజ్వేంద్ర చాహల్ ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో భారీ మొత్తాన్ని అందుకున్నారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ చాహల్‌ను రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. గతంలో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన 34 ఏళ్ల చాహల్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లు పోటీ పడగా, చివరకి పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. చాహల్ తనకు దక్కిన రికార్డు ధరపై స్పందించారు. వేలం జరుగుతున్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఫీలయ్యాయని, కానీ తన పేరుపై వచ్చిన బిడ్డింగ్ చూస్తుంటే ఆసక్తిగా అనిపించిందన్నారు. ముఖ్యంగా తనను తీసుకున్న పంజాబ్ కింగ్స్‌కు ధన్యవాదాలని చెప్పారు. ఇంత మొత్తంలో తన మీద పెట్టిన నమ్మకానికి న్యాయం చేస్తానని పేర్కొన్నారు.
నాపై నమ్మకానికి న్యాయం చేస్తా : చాహల్
ఈ ధర తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈసారి పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాంటింగ్‌తో కలిసి పని చేయడంపై చాహల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రికీ పాంటింగ్ వద్ద చాలా విషయాలు నేర్చుకోవచ్చని, తన ఇంటికి పంజాబ్ దగ్గరగా ఉండటం మంచి విశేషమన్నారు. ఈసారి టీ20 క్రికెట్‌లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ కొత్త సవాళ్లను తీసుకొస్తుందని, నేడు 4 ఓవర్లలో 40 పరుగులు ఇవ్వడం సాధారణం అయిపోయిందన్నారు. చాహల్ ఐపీఎల్ చరిత్రలో 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. ఇక ఈ మెగా వేలం ద్వారా చాహల్ పంజాబ్ కింగ్స్‌కు ఒక కీలక ప్లేయర్‌గా మారారు.