LOADING...
Fifa World Cup 2026: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. విజేతకు రూ.451 కోట్లు
ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. విజేతకు రూ.451 కోట్లు

Fifa World Cup 2026: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు.. విజేతకు రూ.451 కోట్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ విజేతకు రికార్డు స్థాయిలో నగదు బహుమతి అందనుంది. ఈసారి టైటిల్‌ గెలిచిన జట్టుకు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ లభించనుంది. 2022 ప్రపంచకప్‌లో అర్జెంటీనా విజేతగా నిలవగా, ఆ జట్టుకు అప్పట్లో రూ.379 కోట్లు అందాయి. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి మొత్తం ప్రైజ్‌మనీని ఫిఫా 48.9 శాతం మేర పెంచింది. 2022 ప్రపంచకప్‌లో మొత్తం నగదు బహుమతి రూ.3971 కోట్లుగా ఉండగా, 2026 టోర్నీకి దాన్ని రూ.5911 కోట్లకు పెంచారు. గ్రూప్‌ దశలో పోటీపడే 48 జట్లకు రూ.81 కోట్ల చొప్పున అందజేయనున్నారు. అలాగే టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు అదనంగా రూ.13.53 కోట్లు కేటాయించారు.

Details

ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించే టీమ్‌లకు రూ.135 కోట్లు  

రౌండ్‌ ఆఫ్‌ 32 దశకు చేరే జట్లకు రూ.99.27కోట్లు చొప్పున లభించనుండగా, ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున అందిస్తారు. క్వార్టర్స్‌ చేరే జట్లకు రూ.171కోట్ల చొప్పున దక్కనుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు సంపాదించనుండగా, మూడో స్థానాన్ని సాధించే టీమ్‌కు రూ.261 కోట్లు లభిస్తాయి. ఫైనల్‌లో ఓడిన రన్నరప్‌కు రూ.297 కోట్లు అందజేస్తారు. ఇక ప్రపంచకప్‌ విజేత జట్టుకు అత్యధికంగా రూ.451 కోట్ల బహుమతి అందనుంది. 2025 క్లబ్‌ ప్రపంచకప్‌ను నెగ్గిన చెల్సీకి రూ.1128కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్‌ జట్ల నిర్వహణకు ఖర్చులు ఎక్కువగా ఉండటంతో, ఫిఫా ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని క్లబ్‌ టోర్నీలకు అధిక ప్రైజ్‌మనీ కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement