తదుపరి వార్తా కథనం

IND Vs NZ: న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌట్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 01, 2024
03:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో, న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను బాగా కట్టడి చేశారు. ఈ మ్యాచులో స్పిన్నర్లే తొమ్మిది వికెట్లు పడగొట్టడం విశేషం. జడేజా బౌలింగ్ అద్భుతంగా ఐదు వికెట్లు తీశాడు.
వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో ఫర్వాలేదనిపించారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీసుకున్నాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ 82 పరుగులు చేసి ప్రధాన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
అతనికి సహాయం అందించిన విల్ యంగ్ 71 పరుగులు సాధించాడు. టామ్ లాథమ్ 28, గ్లెన్ ఫిలిప్స్ 17 పరుగులు చేశారు.