LOADING...
Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ వీడ్కోలు
అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ వీడ్కోలు

Bracewell: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ డగ్ బ్రేస్‌వెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించాడు. కొంతకాలంగా పక్కటెముకల గాయంతో బాధపడుతున్న బ్రేస్‌వెల్, గాయం తీవ్రత పెరగడంతో ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టుకు కూడా అందుబాటులో లేకపోయాడు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలోనే క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు. 35 ఏళ్ల బ్రేస్‌వెల్ 2011లో న్యూజిలాండ్ జట్టుకు అరంగేట్రం చేశాడు. 2023లో బ్లాక్‌క్యాప్స్ తరఫున చివరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

Details

న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు ఆడిన అనుభవం

తన అంతర్జాతీయ కెరీర్‌లో న్యూజిలాండ్ తరఫున 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 74 వికెట్లు పడగొట్టడంతో పాటు 568 పరుగులు సాధించాడు. వన్డేల్లో 26 వికెట్లు తీసి 221 పరుగులు చేయగా, టీ20 ఫార్మాట్‌లో 20 వికెట్లు, 126 పరుగులు నమోదు చేశాడు. బ్రేస్‌వెల్ కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టంగా 2011లో హోబార్ట్ వేదికగా ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ సాధించిన చారిత్రక టెస్ట్ విజయం నిలిచింది. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అతడు 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Details

ఇది ఎంతో గర్వించదగ్గ క్షణం

ఆ మ్యాచ్‌లో కివీస్ జట్టు కేవలం 7 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. రిటైర్మెంట్ సందర్భంగా బ్రేస్‌వెల్ మాట్లాడుతూ, "ఇది నా జీవితంలో ఎంతో గర్వించదగ్గ క్షణం. చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆడాలన్నది నా కల. న్యూజిలాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం రావడం నా అదృష్టం. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలని భావోద్వేగంగా స్పందించాడు.

Advertisement