ICC Mens T20 World Cup: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిచెల్ శాంట్నర్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 వరల్డ్ కప్-2026కు సంబంధించి న్యూజిలాండ్ జట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా టోర్నీలో జట్టుకు స్పిన్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ నాయకత్వం వహించనున్నాడు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టు వివరాలను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ఉదయం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఈసారి టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా జరగనుంది. టోర్నీకి ముందుగా న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భారత జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ జట్టు కీలక మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది.
వివరాలు
న్యూజిలాండ్.. టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఇదే..
ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఫిబ్రవరి 10న అదే వేదికలో యూఏఈతో, ఫిబ్రవరి 14న అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో, ఫిబ్రవరి 17న చెన్నైలో కెనడాతో తలపడనుంది. జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), డెవన్ కాన్వే (వికెట్ కీపర్), ఫిన్ అలెన్ (వికెట్ కీపర్), టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, జాకబ్ డఫీ, లూకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారెల్ మిచెల్, ఆడమ్ మిలైన్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధీ
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఐసీసీ చేసిన ట్వీట్
All bases covered in Mitchell Santner's New Zealand #T20WorldCup squad 📝
— ICC (@ICC) January 7, 2026
More 📲 https://t.co/DW32YXKlqX pic.twitter.com/mgLgrKFxon