శ్రీలంకను చిత్తును చేసిన న్యూజిలాండ్
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ నమోదు చేసింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే 5 వికెట్లతో విజృంభించాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అలెన్ (51), డారిల్ మిచెల్ (47), గ్లెన్ ఫిలిప్స్ (39), రచిన్ రవీంద్ర 49 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో చమిక కరుణరత్నే నాలుగు వికెట్లు తీశాడు. ఫిన్ అలెన్ 49 బంతుల్లో 51 పరుగులు చేసి ఆదుకున్నాడు. దీంతో వన్డేలో ఐదోవ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. 18వన్డేల్లో 31.35 సగటుతో 533 పరుగులను చేశాడు.
1-0తో ముందంజలో న్యూజిలాండ్
తన తొలి వన్డేల్లో రవీంద్ర 52 బంతుల్లో 49 పరుగులు చేశాడు. హెన్రీ షిఫ్లీ దెబ్బకు శ్రీలంక 76 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం హెన్రీ నాలుగు వన్డేలో 20.25 సగటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టడం విశేషం. ఈమ్యాచ్ లో డారిల్ మిచెల్ 58 బంతుల్లో 47 పరుగులు చేయడంతో పాటు రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. వన్డేల్లో పరుగుల పరంగా న్యూజిలాండ్‌కి ఇది అతిపెద్ద విజయం కావడం గమనార్హం. శ్రీలంక 190 పరుగుల లేదా అంతకంటే ఎక్కువ పరుగులతో వన్డేల్లో ఓడిపోవడం ఇది ఎనిమిదో సారి. తొలి వన్డే విజయంతో న్యూజిలాండ్ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది.