Page Loader
మొదటి వన్డేలో విజృంభించిన చమిక కరుణరత్నే
మొదటి వన్డేలో నాలుగు వికెట్లు తీసిన కరుణరత్నే

మొదటి వన్డేలో విజృంభించిన చమిక కరుణరత్నే

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్ జరిగిన తొలి వన్డేలో రైట్ ఆర్మ్ పేసర్ చమిక కరణరత్నే బౌలింగ్‌లో విజృంభించాడు. కరుణరత్నే తొమ్మిది ఓవర్లలో 4/43తో చెలరేగాడు. దీంతో న్యూజిలాండ్ 49.3 ఓవర్లకు 274 పరుగులు చేసి ఆలౌటైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కరుణరత్నే మొదట టాప్ ఆర్డర్ బ్యాటర్లు విల్ యంగ్ (26), ఫిన్ అలెన్ (51)లను అవుట్ చేసి న్యూజిలాండ్ ను దెబ్బ కొట్టాడు. అనంతరం హెన్రీ షిప్లీ (6), మాట్ హెన్రీ (0)లను అవుట్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లకు దడ పుట్టించాడు.

కరుణరత్నే

బౌలింగ్‌లో సత్తా చాటిన కరుణరత్నే

వన్డేలో మొదటి సారిగా నాలుగు వికెట్లతో కరుణరత్నే సత్తా చాటాడు. గతేడాది పల్లెకెలో జరిగిన ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 3/47 చెలరేగిన విషయం తెలిసిందే. ఈ పేసర్ ప్రస్తుతం 22 వన్డేల్లో 27.75 సగటుతో 24 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్‌లో కాకుండా బ్యాటింగ్ విభాగంలో 29.14 సగటుతో 408 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీని బాదాడు. ఒక దశలో కివీస్ 152/5 స్కోరు చేసి కష్టాల్లో పడింది. అనంతరం గ్లెన్ ఫిలిప్స్ (39), అరంగేట్రం ఆటగాడు రచిన్ రవీంద్ర (49) రాణించడంతో న్యూజిలాండ్ 274 పరుగులకు ఆలౌటైంది.