Page Loader
ఫిన్ అలెన్ వన్డేలో ఐదో హాఫ్ సెంచరీ
49 బంతుల్లో 52 పరుగులు చేసిన ఫిల్ అలెన్

ఫిన్ అలెన్ వన్డేలో ఐదో హాఫ్ సెంచరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 49 బంతుల్లో 52 పరుగులు చేశాడు. దీంతో వన్డే క్రికెట్‌లో ఐదు హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చాడ్ బోవ్స్ (14). విల్ యంగ్ (26), డారిల్ మిచెల్ 47 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసిన అనంతరం ఫిల్ అలెన్ చమికా కరుణరత్నే బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన ఫిల్ అలెన్ అరుదైన ఘనతను సాధించాడు. వన్డేల్లో 500 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఫిల్ అనెల్

వన్డేల్లో 500 పరుగులు చేసిన ఫిల్ అనెల్

ఇప్పటివరకూ 18 వన్డేలు ఆడిన ఫిల్ అనెల్ 31.35 సగటుతో 533 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలున్నాయి. వన్డేలో అత్యధికంగా 96 పరుగులు చేశాడు. ఒక దశలో కివీస్ 152/5 స్కోరు చేసి కష్టాల్లో పడింది. అనంతరం గ్లెన్ ఫిలిప్స్ (39), అరంగేట్రం ఆటగాడు రచిన్ రవీంద్ర (49) రాణించడంతో న్యూజిలాండ్ 274 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో కరుణరత్నే తొమ్మిది ఓవర్లలో 4/43తో విజృంభించాడు. రజిత, కుమారా తలో రెండు వికెట్లు తీశాడు.