Page Loader
హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక
తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసిన హెన్రీ షిఫ్లీ

హెన్రీ షిఫ్లీ దెబ్బకు తోకముడిచిన శ్రీలంక

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 25, 2023
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో కివీస్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ షిప్లే విశ్వరూపం ప్రదర్శించాడు. అద్భుతమైన బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటర్లను దెబ్బ కొట్టాడు. హెన్రీ షిప్లే ఐదు వికెట్లు తీసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వన్డే క్రికెట్లో ఐదు వికెట్లు తీసిన 27వ కివీస్ బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మొదట హెన్రీ బౌలింగ్‌లో లంక ఓపెనర్ ఫెర్నాండో రనౌట్ అయ్యాడు. 3.3 ఓవర్లో మరో ఓపెన్ పాతుమ్ నిసాంకను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కుసల్ మెండిస్ (0), అసలంక (9), దసున్ షనక (0)లను ఔట్ చేసి, శ్రీలంక బ్యాటర్లను పెవిలియానికి పంపాడు.

హెన్రీ షిప్లీ

సత్తా చాటిన హెన్రీ షిప్లీ

హెన్రీ షిఫ్లీ దెబ్బకు శ్రీలంక 76 పరుగులకే ఆలౌటైంది. ప్రస్తుతం హెన్రీ నాలుగు వన్డేలో 20.25 సగటుతో ఎనిమిది వికెట్లు పడగొట్టడం విశేషం. లిస్ట్-A క్రికెట్‌లో 43 మ్యాచ్‌లలో షిప్లీ, రెండో సారి ఐదు వికెట్లను తీశాడు. ఈ ఫార్మాట్‌లో 46 వికెట్లను తీసి సత్తా చాటాడు. అటు బ్యాటింగ్‌లో అతని ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. శ్రీలంక 198 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. తొలి వన్డేలో విజయంతో న్యూజిలాండ్ జట్టు 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్లు అద్బుతమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించారు.