Kane Williamson Record: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత ఘనత.. క్రికెట్ చరిత్రలో నూతన రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మరో అరుదైన టెస్ట్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో డిసెంబర్ 2న ప్రారంభమైన న్యూజిలాండ్ వర్సెస్ వెస్టిండీస్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో కేన్ 102 బంతుల్లో 6 ఫోర్లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌తో కలిసి, విలియమ్సన్ టెస్టుల్లో వెస్టిండీస్‌పై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో న్యూజిలాండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం అతని స్కోరు 1022. ఈ ఘనతను ఇంతకుముందు రాస్ టేలర్ (1136 పరుగులు) మాత్రమే సాధించాడు. అంతేకాదు, ఒక్క మ్యాచ్‌లోనే విలియమ్సన్ మరో రికార్డును సాధించాడు. టెస్ట్‌ల్లో వెస్టిండీస్‌పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో నాథన్ ఆస్టల్ రికార్డును సమం చేశాడు.
Details
వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు
కేన్, ఆస్టల్ ఇద్దరూ కరేబియన్ జట్టుపై చెరో 8 అర్ధశతకాలు చేశారు. రాస్ టేలర్ - 1136 కేన్ విలియమ్సన్ - 1022 గ్లెన్ టర్నర్ - 855 BE కాంగ్డన్ - 764 నాథన్ ఆస్టల్ - 715
Details
మ్యాచ్ పరిస్థితి
తొలి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ తడబడింది. కేవలం 120 పరుగుల వద్దే కివీస్ సగం జట్టు పెవిలియన్ చేరింది. ప్రారంభంలో ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్ అయ్యాడు. తరువాత కేన్ విలియమ్సన్ - లాథమ్ (24) కొంతసేపు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. జట్టు స్కోరు 94 వద్ద కేన్ ఔటయ్యాక న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. వెంటనే లాథమ్ కూడా ఔట్ అయ్యాడు. తర్వాతి 8 పరుగుల్లోనే రచిన్ రవీంద్ర (3) జేడెన్ సీల్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. మిగిలిన 17 పరుగుల తర్వాత విల్ యంగ్ (14) కూడా పెవిలియన్ చేరాడు.
Details
క్రీజులో బ్రేస్‌వెల్
విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, లేన్, ఓజే షీల్డ్స్ తలో ఓ వికెట్ తీయగా, గ్రీవ్స్ 2 వికెట్లు తీసాడు. 60 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి న్యూజిలాండ్ 192 పరుగుల వద్ద ఉంది. ప్రస్తుతం క్రీజులో బ్రేస్‌వెల్ (31)* నాథన్ స్మిత్ (18)* ఉన్నారు.