
NZ vs SA: చిత్తుగా ఓడిన న్యూజిలాండ్.. సెమీస్‌కు మరింత చేరువైన సౌతాఫ్రికా
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ పూణే వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేశారు.
ఇక లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 190 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంలో సౌత్ ఆఫ్రికా సెమీస్‌కు మరింత చేరువైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో రస్సీ వాన్ డర్ డస్సెన్ 118 బంతుల్లో 133 పరుగులు (9 ఫోర్లు, 5సిక్సర్లు), డికాక్ 116 బంతుల్లో 114 పరుగులు (10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో విజృంభించాడు.
ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (30 బంతుల్లో 53 పరుగులు) మెరుపులు మెరిపించారు.
Details
నాలుగు వికెట్లతో చెలరేగిన మహారాజ్
న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌతీ రెండు వికెట్లు తీయగా, ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ తలా ఓ వికెట్ తీశారు.
లక్ష్య చేధనలో న్యూజిలాండ్ బ్యాటర్లు తడబడ్డారు. ఫిలిప్స్ 60 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇక విల్ యంగ్ 33, డారిల్ మిచెల్ 24 పరుగులు చేశారు.
మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పెవిలియానికి చేరారు.
కేసవ్ మహారాజ్ 4, మార్కో జాన్సన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు తీసి న్యూజిలాండ్ బ్యాటర్ల నడ్డి విరిచారు. దీంతో ఏ దశలోనూ న్యూజిలాండ్ పోరాడలేకపోయింది.
సౌతాఫ్రికా బౌలర్ల దాటికి న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌటైంది.