IND vs NZ: తొలి టెస్టు.. టీమిండియా పై ఎనిమిది వికెట్లతో గెలిచిన న్యూజిలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్, లంచ్ బ్రేక్‌కు ముందు స్కోర్‌ను ఛేదించింది.
అంతకుముందు,తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులు,న్యూజిలాండ్ 402 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేసింది.
ఓపెనర్లు టామ్ లేథమ్ (0),డేవన్ కాన్వే (17) ఔటైనప్పటికీ, మరో వికెట్ పడనీయకుండా విల్ యంగ్ (45*), రచిన్ రవీంద్ర (39*) మూడో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు.
భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు.
మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.చివరిసారిగా 1988లో భారత్‌లో న్యూజిలాండ్ టెస్టు మ్యాచ్ విజయం సాధించడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
1ST Test. New Zealand Won by 8 Wicket(s) https://t.co/8qhNBrs1td #INDvNZ @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 20, 2024