NZ Vs SL : టాస్ గెలిచిన న్యూజిలాండ్.. తుది జట్లు ఇవే
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ శ్రీలంక, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలు అందుకున్న న్యూజిలాండ్, తర్వాతి నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓటములతో చతికిలపడింది. దీంతో ఈ మ్యాచులో గెలిచి సెమీస్ బెర్తును కన్ఫామ్ చేసుకోవాలని కివీస్ జట్టు భావిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. శ్రీలంక ఈ జట్టులో ఒక మార్పును చేసింది.
ఇరు జట్లలోని సభ్యులు
న్యూజిలాండ్ జట్టు డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(సి), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్(w), టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్ శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక