ఒంటిచేత్తో విహారి బ్యాటింగ్, స్పందించిన దినేష్ కార్తీక్
టీమిండియా ప్లేయర్ హనుమాన్ విహారికి క్రికెట్ పట్ల ఎంతో నిబద్ధత ఉందని మనకు తెలుసు. ఈ మధ్య ఆస్ట్రేలియా టూరులో ఆ టీమ్ బౌలర్లు విసురుతున్న బంతులకు తన శరీరాన్ని అడ్డుగా పెట్టి అప్పట్లో విరోచితంగా పోరాడిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రంజీట్రోఫీలో మధ్యప్రదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన ఎడమ చేతి మణికట్టు విరిగినా ఒంటి చేత్తో బ్యాటింగ్ ఆడి.. తనకు క్రికెట్ అంటే ఎంత ప్రాణామో ఆడి చూపించాడు. దెబ్బ తగిలినా రెండో ఇన్నింగ్స్ లో హనుమాన్ విహారి మొండిగా బ్యాటింగ్ దిగి ఒంటిచేత్తో మూడు ఫోర్లు కొట్టాడు.
రివర్స్ స్వీప్ కాదు రివర్స్ స్లాప్
హనుమాన్ విహారి రివర్స్ స్వీప్ ఒక ఫోర్ కొట్టాడు. ఇది చూసిన టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. అది రివర్స్ స్వీప్ కాదు రివర్స్ స్లాప్ అంటూ సరదాగా దినేష్ కార్తీక్ కామెంట్ చేశాడు. ఆంధ్రా టీమ్ డ్రెస్సింగ్ రూమ్ లో అయితే విహారి బ్యాటింగ్ కు దిగినప్పటి నుంచి చప్పట్లో మోత మోగించారు. అయితే విహారి ఎంత పోరాటం చేసినా రెండో ఇన్నింగ్స్ లో ఆ టీమ్ కేవలం 93 పరుగులకే ఆలౌటైంది.