LOADING...
కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్
కర్నాటక తరుపున సెంచరీ సాధించిన శ్రేయాస్ గోపాల్

కర్ణాటక తరఫున సూపర్ సెంచరీతో మెరిసిన శ్రేయాస్ గోపాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2023
09:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆల్ రౌండర్ శ్రేయాస్ గోపాల్ రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేశారు. క్వార్టర్-ఫైనల్‌లో ఉత్తరాఖండ్‌పై కర్ణాటక తరఫున అజేయ సెంచరీతో అదరగొట్టాడు. గోపాల్ ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచారు. మొత్తం ఈ ఫార్మాట్లో 3000 పరుగులకు మార్కును దాటి సత్తా చాటాడు. అంతకుముందు ఉత్తరాఖండ్ 116 పరుగులకు కర్నాటక ఆలౌట్ చేసింది. మొదటి రోజు 123 పరుగులతో ఆటను కర్నాటక ముగించింది. రవికుమార్ సమర్థ్, మయాంక్ అగర్వాల్ హాప్ సెంచరీలతో రాణించడంతో కర్నాటక భారీ పరుగులు సాధించింది. 4వికెట్లకు 307 పరుగులు సాధించిన క్రమంలో శ్రేయాస్ గోపాల్ క్రీజులోకి వచ్చాడు. గోపాల్ 288 బంతుల్లో 161 పరుగులు చేశాడు. దీంతో కర్ణాటక 606 పరుగులు చేయగలిగింది.

శ్రేయాస్ గోపాల్

శ్రేయాస్ గోపాల్ సాధించిన రికార్డులివే

గోపాల్ 75 మ్యాచ్ లు ఆడి 3వేల పరుగులను సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 13 అర్ధసెంచరీలను చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ బౌలింగ్ కూడా ఈ మణికట్టు-స్పిన్నర్ 200కి పైగా వికెట్లు సాధించాడు. 2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గోపాల్ చారిత్రాత్మక హ్యాట్రిక్ సాధించాడు. అతను విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్ మార్కస్ స్టోయినిస్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ ఘనతకు సాధించిన విషయం తెలిసిందే. అమిత్ మిశ్రా, యువరాజ్ సింగ్ తర్వాత T20లలో హ్యాట్రిక్‌లు నమోదు చేసిన మూడో భారతీయుడిగా గోపాల్ నిలిచాడు.