ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రికార్డు క్రియేట్ చేసిన మయాంక్ అగర్వాల్
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనతను సాధించాడు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ పోరులో కర్నాటక కెప్టెన్ మయాంక్ అద్భుత హాఫ్ సెంచరీతో రికార్డును క్రియేట్ చేశాడు. 109 బంతుల్లో 89 పరుగులు చేసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఉత్తరాఖండ్‌ను 116 పరుగులకే కర్నాటక బౌలర్లు ఆలౌట్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన కర్నాటక ఓపెనర్లు మయాంక్, రవికుమార్ సమర్థ్ ఓపెనింగ్ వికెట్‌కు 159 పరుగులు జోడించడంతో కర్ణాటకకు అద్భుతమైన ఆరంభం లభించింది.
సూపర్ ఫామ్‌లో మయాంక్ అగర్వాల్
ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో మయాంక్ మంచి ఫామ్‌తో ఉన్నాడు. 11 ఇన్నింగ్స్‌లలో అతని స్కోర్లు 8, 73, 51, 50, 117, 14, 52*, 10, 208, 20 83 ఉన్నాయి. మయాంక్ 68.6 సగటుతో 686 పరుగులు సాధించాడు. మనీష్ పాండే 20 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉండగా.. మయాంక్ 14 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అగర్వాల్ నవంబర్ 2010లో తన ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 89 మ్యాచ్‌లో 45 సగటుతో 6,540 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలున్నాయి. టీమిండియా తరఫున 21 టెస్టు మ్యాచ్ లు ఆడి మయాంక్ 1,488 పరుగులు చేశాడు