
అవేష్‌ఖాన్ బౌలింగ్‌లో గాయపడ్డ హనుమ విహారి
ఈ వార్తాకథనం ఏంటి
రంజీ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్ హునమ విహారి గాయపడ్డాడు. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 క్వార్టర్-ఫైనల్లో అవేష్ ఖాన్ బౌన్సర్ దెబ్బకు విహారి మణికట్టు ఫ్రాక్చర్ అయింది.
బంతి తగిలినా విహారి బ్యాటింగ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఊపే సమయంలో చాలా ఆసౌకర్యానికి గురయ్యాడు. వెంటనే మైదానం విడిచి బయటికెళ్లాడు.
వెంటనే అతని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎడమ చేతి మణికట్టుకు పగల్లు ఏర్పడినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 16 పరుగులు చేసిన తరువాత విహారి రిటైరయ్యాడు.
అనంతరం క్రీజులో ఉన్న రికీభుయ్‌తో కరణ్ షిండే జతకట్టాడు.
విహారి
2018 భారత్ తరుఫున విహారి అరంగ్రేటం
రంజీ ట్రోఫీ 2022-23లో విహారి ఇప్పటివరకు 464 పరుగులు సాధించారు. ఇందులో రెండు అర్ధ సెంచరీలను చేశాడు.
2018లో ఇంగ్లండ్‌పై భారత్ తరుపున అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకూ 16 టెస్టు మ్యాచ్ లు ఆడి 839 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలున్నాయి.
విహారి చివరిసారిగా జూలై 2022లో ఇంగ్లండ్‌తో చివరి టెస్టులో భారతదేశం తరపున ఆడాడు. విహారి 113 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 8574 పరుగులు చేశారు. ఇందులో 23 సెంచరీలు, 45 అర్ధ సెంచరీలున్నాయి.