Page Loader
సూపర్ ఫామ్‌లో రవీంద్ర జడేజా
రంజీ మ్యాచ్ లో ఏడు వికెట్లు పడగొట్టిన జడేజా

సూపర్ ఫామ్‌లో రవీంద్ర జడేజా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2023
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ మ్యాచ్‌లో దుమ్ములేపుతున్నాడు. తమిళనాడుతో జరుగుతున్న రంజీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు జడేజా ఫామ్‌లోకి రావడం శుభ సూచకమే అని చెప్పొచ్చు. జడేజా మోకాలి గాయం నుండి కోలుకున్న తర్వాత సౌరాష్ట్ర తరుపున బరిలోకి దిగాడు. చైన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో 17.1 ఓవర్లలో 53 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో జడేజా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 24 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా ఒక వికెట్ మాత్రమే తీశాడు. జడేజా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 115 మ్యాచ్ లు ఆడి, 460 వికెట్లు పడగొట్టాడు.

రవీంద్ర జడేజా

రవీంద్ర జడేజా ఈజ్‌బ్యాక్

మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు 324/10 స్కోర్ చేసింది. ఆ ఇన్నింగ్స్‌లో జడేజా కేవలం ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 192 పరుగులకు ఆలౌటైంది. ఇందులో జడేజా కేవలం 15 పరుగులు చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం జడేజా చేలరేగిపోయాడు. జడేజా ఏడు వికెట్లు తీయడంతో తమిళనాడు 133 పరుగులకే కుప్పకూలారు. ఆసియా కప్ మధ్యలోనే జడేజా మోకాలి గాయం కారణంగా వైదొలిగాడు. టీ20 వరల్డ్ కప్‌లో జడేజా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్‌కు ప్రస్తుతం జడేజా కీలకం కానున్నాడు .దీంతో జడేజా ఈజ్ బ్యాక్ అని అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏడు వికెట్లు సాధించిన రవీంద్ర జడేజా