LOADING...
Nora Fatehi : ప్రపంచకప్‌ స్టేజ్‌పై మరోసారి నోరా డ్యాన్స్‌..వేడుకల్లో బాలీవుడ్‌ భామ సందడి
ప్రపంచకప్‌ స్టేజ్‌పై మరోసారి నోరా డ్యాన్స్‌..వేడుకల్లో బాలీవుడ్‌ భామ సందడి

Nora Fatehi : ప్రపంచకప్‌ స్టేజ్‌పై మరోసారి నోరా డ్యాన్స్‌..వేడుకల్లో బాలీవుడ్‌ భామ సందడి

వ్రాసిన వారు Moogati Shabari
May 09, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటి నోరా ఫతేహి మరోసారి ఫిఫా ప్రపంచ కప్‌ వేడుకల్లో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఫిఫా వరల్డ్‌కప్‌ ముగింపు వేడుకల్లో తన అద్భుతమైన నృత్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఈసారి ప్రారంభ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. తన పాటలు, నృత్య ప్రదర్శనలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రారంభ వేడుకల్లో పాల్గొనే ప్రముఖుల జాబితాను నిర్వాహకులు విడుదల చేయగా, అందులో నోరా ఫతేహి పేరు ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు

న్యూజెర్సీలో ఫైనల్..

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రారంభ వేడుక కెనడాలోని టొరంటో నగరంలో జరగనుంది. ఫిఫా ప్రపంచకప్‌ 2026 మ్యాచ్‌లు జూన్‌ 11న ప్రారంభమై జులై 19 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 39 రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటివరకు ఫిఫా ప్రపంచకప్‌లో 32 దేశాలు మాత్రమే పాల్గొనగా, ఈసారి 48 దేశాలు బరిలోకి దిగనున్నాయి. మూడు దేశాల్లోని 16 వేదికల్లో మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ జులై 19న అమెరికాలోని న్యూజెర్సీలో జరగనుంది.

Advertisement