Loading...
Duleep Trophy: దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు ప్రకటన.. అర్ష్‌దీప్‌కు ఛాన్స్, అభిషేక్ శర్మ ఔట్!
దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు ప్రకటన.. అర్ష్‌దీప్‌కు ఛాన్స్, అభిషేక్ శర్మ ఔట్!

Duleep Trophy: దులీప్ ట్రోఫీకి నార్త్ జోన్ జట్టు ప్రకటన.. అర్ష్‌దీప్‌కు ఛాన్స్, అభిషేక్ శర్మ ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ-2026 కోసం నార్త్ జోన్ తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో జమ్మూ కశ్మీర్‌కు చెందిన 24 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కన్హయ్య వాధ్వాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఢిల్లీకి చెందిన యువ ఆటగాడు ఆయుష్ బదోని వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. నార్త్ జోన్ జట్టులో టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కంబోజ్‌లకు చోటు దక్కింది. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన జమ్మూ కశ్మీర్ జట్టు నుంచి కమ్రాన్ ఇక్బాల్, అబ్దుల్ సమద్, అబిద్ ముస్తాక్, సునీల్ కుమార్, యుధ్వీర్ సింగ్ వంటి పలువురు ఆటగాళ్లకు కూడా అవకాశమిచ్చారు.

వివరాలు

సీనియర్ ఆటగాడు పరాస్ డోగ్రాకు చోటు దక్కలేదు

దేశవాళీ క్రికెట్‌లో వారు ప్రదర్శించిన ప్రతిభకు గుర్తింపుగానే ఈ ఎంపికను భావిస్తున్నారు.

అయితే పంజాబ్ స్టార్ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్‌లకు ఈసారి నార్త్ జోన్ జట్టులో చోటు దక్కలేదు.

మరోవైపు టీమిండియా శ్రీలంక పర్యటన నేపథ్యంలో శుభ్‌మన్ గిల్, ఆకిబ్ నబీ అందుబాటులో లేరని సెలక్షన్ కమిటీ వెల్లడించింది.

అలాగే 41 ఏళ్ల సీనియర్ ఆటగాడు పరాస్ డోగ్రా పేరును కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు.

వివరాలు

ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన అనుభవం

కెప్టెన్‌గా ఎంపికైన కన్హయ్య వాధ్వాన్ ఇప్పటివరకు తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 16 మ్యాచ్‌లు ఆడి 883 పరుగులు చేశాడు.

అతను 2018-19 సీజన్‌లో కేవలం 17 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పుడు దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్‌కు నాయకత్వం వహించే అవకాశం దక్కడంతో అతనిపై మరింత బాధ్యత పెరిగింది.

ADVERTISEMENT